ముచ్చెమటలు పట్టిస్తోన్న ‘LeEco Le 1s’

Written By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలకు తెరలేపుతూ చైనా ఫోన్‌ల కంపెనీ LeEco తన మొట్టమొదటి బడ్జెట్ ఫోన్ Le 1sను ఇండియన్ మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసింది. లెనోవో కే4 నోట్ ఫోన్‌కు ప్రధాన కాంపిటీటర్‌గా విడుదలైన శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో ప్రత్యర్థి బ్రాండ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

జనవరిలో లాంచ్ అయిన 20 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LeEco Le 1s vs Lenovo K4 Note

Le 1s స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన మెటల్ యునిబాడీతో వస్తోంది. ఈ డిజైనింగ్ ఫోన్‌కు సాలిడ్ లుక్‌ను తీసుకువస్తుంది. bezel less డిజైన్ డిస్‌ప్లే ఫోన్‌ను చేతిలో సౌకర్యవంతంగా ఇమిడేలా చేస్తుంది.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

లెనోవో కే4 నోట్ ప్లాస్టిక్ బ్యాక్ అలానే మెటాలిక్ ఫ్రేమ్‌తో వస్తోంది.

LeEco Le 1s vs Lenovo K4 Note

డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో Le 1s, కే4నోట్‌ను అధిగమించిందనే చెప్పాలి.

LeEco Le 1s vs Lenovo K4 Note

డిస్‌ప్లే విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లను 5.5 అంగుళాల 1080 పిక్సల్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలతో వస్తున్నాయి.

LeEco Le 1s vs Lenovo K4 Note

ప్రాసెసర్ విషయానికొస్తే... లెనోవ్ కే4 నోట్‌లో, 1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్‌ను పొందుపరిచారు.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

Le 1s స్మార్ట్‌ఫోన్‌లో 2.2గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన హై-ఎండ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 చిప్‌సెట్‌ను పొందుపరిచారు.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

ప్రాసెసింగ్ విషయంలో గేమింగ్ ప్రియులను Le 1s స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకుంటుంది.

LeEco Le 1s vs Lenovo K4 Note

ర్యామ్ విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలో 3జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. మల్టీటాస్కింగ్ బాగుంటుంది.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

కెమెరా విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను పొందుపరిచారు. కేవలం 0.09 సెకన్లలో ఫోకస్‌ను లాక్ చేయగలిగే అద్భుతమైన సాంకేతికతను Le 1s స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో పొందుపరచటం విశేషం. అదనంగా ఫోన్‌లో పొందుపరిచిన 'slo-mo' రికార్డింగ్ ఫీచర్ ద్వారా వీడియోలను స్లో మోషన్‌లో రికార్డ్ చేసుకోవచ్చు.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

స్టోరేజ్ విషయానికొస్తే.. కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. Le 1s స్మార్ట్‌ఫోన్‌ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్  సౌకర్యం లోపించింది. 

 

LeEco Le 1s vs Lenovo K4 Note

Le 1s స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన EUI పై రన్ అవుతుంది. ఆడ్రాయిడ్ 6.0కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో కే4 నోట్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఫోన్‌కు Android 6.0 అప్‌డేట్ అందనుంది. Le 1s స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు Eros Now, YuppTV సబ్‌స్ర్కిప్షన్‌లను ఉచితంగా పొందవచ్చు.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తున్నాయి. Le 1s స్మార్ట్‌ఫోన్‌ ఫ్రింగర్ ప్రింట్ స్కానర్ లో ఉపయోగించిన బయోమెట్రిక్ మాడ్యుల్ ఆకట్టుకుంటుంది.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే... డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, మొబైల్ హాట్‌స్పాట్, బ్లుటూత్ 4.1, జీపీఎస్ వంటి ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో ఉన్నాయి.

 

LeEco Le 1s vs Lenovo K4 Note

లెనోవో కే4 నోట్ మార్కెట్ ధర రూ.11,999. అమెజాన్ ఇండియా ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. Le 1s స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ ధర రూ.10,999. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మొదటి ఫ్లాష్‌సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 1s vs Lenovo K4 Note: Which is the budget phone for you? Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot