లీకో నుంచి 64జిబి ఫోన్, జియో సిమ్ ఫ్రీ హోమ్ డెలివరీ

Written By:

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లీకో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లీకో లీ2ను 64 వేరియంట్‌లో విడుదల చేసింది. స్నాప్‌డీల్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ విక్రయిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 3జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ 32 జిబి అలాగే 64 జిబి రెండు వేరియంట్లలో కష్టమర్లకు లభ్యమవుతోంది. 32 జిబి వేరియంట్ ధర రూ. 11999 కాగా 64 జిబి వేరింయట్ ధర రూ. 13,999గా కంపెనీ నిర్ణయించింది.

ఐటీ రంగాన్ని బెంబేలెత్తిస్తున్న విప్రో,ఇన్ఫోసిస్ లేఖలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ ను కలిగి ఉంది, అడ్రినో 510 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్ లు దీని సొంతం

కెమెరా

16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ను పొందుపరిచారు.

అదనపు ఫీచర్లు

డాల్బీ అట్మోస్, ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ , 4 జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2, యూఎస్టీ టైప్-సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటివి అదనపు ఫీచర్లు

ఫోన్ పై ఆఫర్

స్నాప్ డీల్ లో ఈ ఫోన్ పై ఆఫర్ ని ప్రకటిస్తోంది.హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే 12 శాతం డిస్కౌంట్ వస్తోంది. అలాగే ఫ్రీ జియో సిమ్ హోమ్ డెలివరీ చేస్తారు. దీంతో పాటు రూ. 4990 లీకో మెంబర్ షిప్ ఉచితంగా లభిస్తుంది.

 

 

ధర

32 జిబి వేరియంట్ ధర రూ. 11999 కాగా 64 జిబి వేరింయట్ ధర రూ. 13,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 2 64GB Storage Variant Now Available Online at Rs. 13,999 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot