Home
Mobile

మరోసారి దుమ్ము రేపిన Le 2 సూపర్‌ఫోన్!

By Sivanjaneyulu Bommu

LeEco సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్ లీ2 మరో ఫ్లాష్‌సేల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. లీఇకో సొంత ఈకామర్స్ వెబ్‌సైట్ అయిన LeMall, భారతదేశపు ఈ-కామర్స్ దిగ్గజం Flipkartలు ఈ ఫ్లాష్ సేల్‌ను విజయవంతంగా పూర్తి చేసాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను సొంతం చేసుకున్న యూజర్లు వొడాఫోన్ డబల్ డేటా ఆఫర్‌ను సొంతం చేసుకున్నారు. మార్కెట్లో తమ Le 2, Le Max2 సూపర్‌ఫోన్‌లకు లభిస్తోన్న జనాధరణ అత్యుత్తమమని లీఇకో ఇండియా చీఫ్ ఆపరేటింగ్ అధికారిక అతుల్ జెయిన్ తెలిపారు.

మరోసారి దుమ్ము రేపిన Le 2 సూపర్‌ఫోన్!

కటింగ్ ఎడ్జ్ డిజైన్‌తో పాటు బెస్ట్ క్లాస్ ఫీచర్లతో వస్తోన్న లీఇకో లీ2 సూపర్‌ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ ఫుల్ మెటల్ బాడీ ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేలో పొందుపరిచిన బ్లు లైట్ ఫిల్టర్ టెక్నాలజీ కంటి అలసటను తగ్గిస్తుంది. సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ భరించగలిగే పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి పైసా వసూల్‌గా అభివర్ణించవచ్చు.

లీ2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే

లీ2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే

లీ2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే, డివైస్‌లో అమర్చిన Qualcomm® SnapdragonTM 652 (MSM8976) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి అంశాలు నునుపైన పనితీరును అందిస్తాయి. Android M ఆధారంగా అభివృద్థి చేసిన EUI 5.8 ఆపరేటింగ్ సిస్టం పై లీ2 ఫోన్ రన్ అవుతుంది.

 

4.3 కన్స్యూమర్ రేటింగ్‌

4.3 కన్స్యూమర్ రేటింగ్‌

హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన 3000 ఎమ్ఏహెచ్ సుధీర్ఘమైన బ్యాకప్‌ను చేరువచేస్తుంది. ఫోన్ కెమెరా విభాగాన్ని పరిశీలించినట్లయితే, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు అసాధారణ పనితీరును కనబరుస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో లీ2 ఫోన్ లను కొనుగోలు చేసిన యూజర్లు ఈ డివైస్‌కు 4.3 కన్స్యూమర్ రేటింగ్‌ను ఇవ్వటం జరిగింది.

 

ప్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లీ మాక్స్ 2

ప్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లీ మాక్స్ 2

LeEco నుంచి విడుదలైన మరో ప్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ లీ మాక్స్ 2, 5.7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో అదరహో అనిపిస్తోంది. 2560×1440 పిక్సల్ రిసల్యూష్ క్వాలిటీతో రన్ అయ్యే ఈ డిస్‌ప్లేను గొప్ప విజువల్ ట్రీట్‌గా అభివర్ణించవచ్చు.

 

లీ మాక్స్ 2 ఫోన్ కెమెరా క్వాలిటీ

లీ మాక్స్ 2 ఫోన్ కెమెరా క్వాలిటీ

21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాన్నే మార్చేసింది. బ్లర్ -ఫ్రీ, అల్ట్రా ఫాస్ట్ ఫోకసింగ్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ వంటి ప్రత్యేక పీచర్లను ఈ కెమెరాలో పొందుపరిచారు. ఫొన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హై క్వాలిటీ సెల్పీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

Le Max2 ఫోన్ ఇంటర్నల్ పనితీరు

Le Max2 ఫోన్ ఇంటర్నల్ పనితీరు

Le Max2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే, Qualcomm® SnapdragonTM 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ వంటి అంశాలు వంటి అంశాలు నునుపైన పనితీరును అందిస్తాయి.

 

USB Type C , CDLA  కనెక్టువిటీ స్టాండర్డ్స్

USB Type C , CDLA కనెక్టువిటీ స్టాండర్డ్స్

లీ2, లీ మాక్స్2 భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లీఇకో డిజైన్ చేసింది. ఈ ఫోన్‌లలో సెట్ చేసిన USB Type C , CDLA వంటి కనెక్టువిటీ స్టాండర్ట్స్ నవశకానికి నాందిగా నిలిచాయి.

 

Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్

Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్

లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ల‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు
లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

ఓపెన్ సేల్ పై లీ మాక్స్2

ఓపెన్ సేల్ పై లీ మాక్స్2

మొదటి రెండు ప్లాష్ సేల్స్ తరువాత లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను లీఇకో ఓపెన్ సేల్ పై విక్రయిస్తోంది. LeMall, Flipkartలు ఎక్స్ క్లూజివ్‌గా Le Max2
ఫోన్‌ను విక్రయిస్తున్నాయి. ప్రతి కొనుగోలు పై రూ.1,990 విలువ చేసే CDLA హెడ్ సెట్ ను ఉచితంగా పొందవచ్చు.

ఫ్లాష్ సేల్స్‌తో భాగంగా లీ2 స్మార్ట్‌ఫోన్‌ను..

ఫ్లాష్ సేల్స్‌తో భాగంగా లీ2 స్మార్ట్‌ఫోన్‌ను..


ఫ్లాష్ సేల్స్‌తో భాగంగా లీ2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు రిజిస్టర్ అవ్వాల్సిన పేజీ లింక్స్ ఇవే...

LeMall

http://in.lemall.com/in/campaigns/Le20620.html?cps_id=SMFB_le2_20160617_FB

 

Flipkart

http://www.flipkart.com/leeco-le-2/p/itmejeucxaxmnk8k?pid=MOBEJEUCS2Z4N2E2

 

LeEco గురించి క్లుప్తంగా...

LeEco గురించి క్లుప్తంగా...

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు. ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
LeEco Le 2: Less than 24 hours left to register for the coming flash sale. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X