ఈ ఫోన్‌కు 4.2 రేటింగ్!

LeEco సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్ లీ2 అదిరిపోయే రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడవ ఫ్లాష్ సేల్‌ను పూర్తి చేసుకున్న లీ2 ఫోన్‌కు ప్లిప్‌కార్ట్ యూజర్లు 4.2 రేటింగ్‌ ఇచ్చారు. జూలై 14 నుంచి ఈ ఫోన్ open sale పై లభ్యంకాబోతోంది. లీఇకో ఈకామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన LeMall.comతో పాటు Flipkartలో ఈ ఫోన్‌లను రేపటి నుంచి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా సొంతం చేసుకోవచ్చు. లీ2 ఫోన్‌తో పాటు లీ మాక్స్2 ఫోన్ కూడా ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్‌కు 4.2 రేటింగ్!

తమ సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన మూడు ఫ్లాష్‌ సేల్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పాయని లీఇకో ఇండియా స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ విభాగపు సీఓఓ అతుల్ జెయిన్ తెలిపారు. CDLA ఆడియో స్టాండర్డ్, సూపర్‌టెయిన్‌మెంట్ రిచ్ కంటెంట్ ఇకో సిస్టం, క్లాసికల్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్ వంటి అంశాలు లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లను మార్కెట్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్

లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ల‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

 

Supertainment

ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. Eros Now, YuppTV, Hungama Musicల భాగస్వామ్యంతో లీఇకో ఈ సేవలను అందిస్తోంది.

 

శక్తివంతమైన ప్రాసెసర్లతో

లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్ ఫోన్స్ శక్తివంతమైన ప్రాసెసర్లతో వస్తున్నాయి. లీ2 ఫోన్ Qualcomm® SnapdragonTM 652 (MSM8976)
ప్రాసెసర్‌తో వస్తుండగా, లీ మాక్స్ 2 ఫోన్ , Qualcomm® SnapdragonTM 820 ప్రాసెసర్‌తో వస్తోంది.

6జీబి ర్యామ్‌, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌

లీ మాక్స్2 ఫోన్‌లో శక్తివంతమైన 6జీబి ర్యామ్‌తో పాటు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను చూడొచ్చు. ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లో పొందుపరిచిన ర్యామ్‌తో పోలిస్తే లీ మాక్స్2 ఫోన్‌లో ఏర్పాటు చేసి ర్యామ్ 3 రెట్లు అధిక సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పోలిస్తే లీ మాక్స్2 ఫోన్ పనితీరు 40 శాతం వేగవంతమైనదిగా ఉంటుంది.

ఇంటర్నల్ పనితీరు

లీ2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి అంశాలు నునుపైన పనితీరును అందిస్తాయి. ధర విషయానికొస్తే లీ2 ఫోన్ రూ.11,999గా ఉంది.

లీ మాక్స్2 ఫోన్ రెండు వేరియంట్‌లలో

లీ మాక్స్2 ఫోన్ రెండు వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతోంది. 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. లీ మాక్స్2 ఫోన్ కొనుగోలు పై రూ.1900 విలువ చేసే CDLA హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు.

లీఇకో అసలు పేరు Letv

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 2 rated with 4.2 stars after its successful third Flash Sale on Flipkart!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting