రూ.1900కే LeEco సూపర్‌ఫోన్, ఏలా అంటారా..?

తన ప్రీమియమ్ క్లాస్ డిజైన్ ఇంకా బెస్ట్ క్లాస్ ఫీచర్లతో LeEco సెకండర్ జనరేషన్ సూపర్‌ఫోన్ Le 2, స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లోకి రివ్వున దూసుకొచ్చిన లీఇకో లీ2 ఫోన్ ఇండియన్ యూజర్లు నమ్మకాన్ని సొంతం చేసుకుంటోంది.

రూ.1900కే LeEco సూపర్‌ఫోన్, ఏలా అంటారా..?

లీ2 సూపర్ ఫోన్‌ను సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన మూడు ఫ్లాష్ సేల్స్‌కు మార్కెట్లో బ్రహ్మాండమైన స్పందన లభించింది. తాజాగా మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, లీ2 ఫోన్‌లను ఓపెన్ సేల్ లీఇకో విక్రయిస్తోంది. నేటి నుంచే ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా ఏ విధమైన రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా లీ2 ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్,

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్,

 

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో),

 

లీఇకో లీ2 ఫోన్ ప్రత్యేకతలు

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

 

రూ.11,999 ధర ట్యాగ్‌తో

రూ.11,999 ధర ట్యాగ్‌తో Le 2 సూపర్ ఫోన్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. లీ2 స్మార్ట్‌ఫోన్‌ను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

 

రూ.4,900 విలువ చేసే

ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

 

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల మోత

లీ2 ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు వొడాఫోన్ డబల్ డేటా ప్యాక్‌ను అందిస్తోంది. అంతేకాకుండా మీ పాత ఫోన్‌లతో లీ2 ఫోన్‌ను exchange చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.10,000 వరకు వెల కట్టే అవకాశముంటుంది.

దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లు

తమ వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

 

లీఇకో గురించి

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

 

లీఇకో గురించి

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le 2 Superphone now available on open sale. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot