8జీబి ర్యామ్‌, 256జీబి స్టోరేజ్‌తో LeEco ఫోన్, ధర కూడా తక్కువే..?

LeEco అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ 'లీ ప్రో 3'(Le Pro 3)కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను LeEco విడుదల చేసింది.

8జీబి ర్యామ్‌, 256జీబి స్టోరేజ్‌తో LeEco ఫోన్, ధర కూడా తక్కువే..?

Read More : 4జీబి ర్యామ్, 5000 mAh బ్యాటరీతో సామ్‌సంగ్ ఫోన్, 26 నుంచి మార్కెట్లోకి

యాపిల్ ఐఫోన్ 7ను టార్గెట్‌గా లాంచ్ అయిన ఈ టీజర్ 'bigger than bigger' అనే ట్యాగ్‌లైన్‌తో ఇంటర్నెట్‌లో హడావుడి చేస్తోంది. ఈ టీజర్ ప్రకారం 'లీ ప్రో 3'స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్ 21న మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బ్లాక్ బస్టర్ ఫోన్‌కు సంబంధించి మార్కెట్లో షికార్లు చేస్తున్న పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5.5 అంగుళాల డిస్‌ప్లేతో

రూమర్ మిల్స్ కధనాల ప్రకారం Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల 2కే డిస్‌ప్లేతో వచ్చే అవకాశం. ఫుల్ హైడెఫినిషన్ ప్యానల్, 2.5డి కర్వుడ్ గ్లాస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

 

8జీబి ర్యామ్...

రూమర్ మిల్స్ కధనాల ప్రకారం Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 8జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉండే అవకాశముంది. ఈ వేరియంట్ octa-core Snapdragon 821 చిప్‌సెట్ పై రన్అయ్యే అవకాశం.

 

6జీబి ర్యామ్ వేరియంట్ కూడా

ఇదే చిప్‌సెట్‌తో 6జబి ర్యామ్ వేరియంట్‌ను కూడా LeEco అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది.

 

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

AnTuTu లిస్టింగ్స్ ప్రకారం Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ మాసివ్ బ్యాటరీతో రాబోతోంది.

6జీబి వేరియంట్

6జీబి వేరియంట్ Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 4070 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికొస్తే..

రూమర్ మిల్స్ కధనాల ప్రకారం 8జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాలతో రాబోతోంది. ఫోన్ ముందుభాగంలో 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

6జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే..

6జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే Le Pro 3 స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేరసినట్లు సమాచారం.

భారీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

రూమర్ మిల్స్ కధనాల ప్రకారం 8జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతున్నట్లు సమాచారం.

32GB, 64GB మెమరీ ఆప్షన్‌లలో కూడా

ఇదే సమయంలో 6జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే Le Pro 3 స్మార్ట్‌ఫోన్ 32GB, 64GB మెమరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ధర ఎంతంటే..?

ఇండియన్ మార్కెట్లో 6జీబి ర్యామ్ వేరియంట్‌ Le Pro 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,999గా ఉండొచ్చు, 8జీబి ర్యామ్ వేరియంట్‌ Le Pro 3 స్మార్ట్‌ఫోన్ ధర రూ.39,000గా ఉండొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Le Pro 3 TEASED: The 8GB RAM Beast Coming on Sep 21 with These 7 Possible Features. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot