లీ 1ఎస్ రికార్డ్ సేల్, 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు

Written By:

లీఇకో నుంచి భారత్‌లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్‌ఫోన్ 'లీ 1ఎస్' (Le 1s) మరో అమ్మకాలు రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫోన్‌కు సంబంధించి మంగళవారం జరిగిన మూడవ ఫ్లాష్ సేల్‌లో 9 సెకన్ల వ్యవధిలో 55,000 ఫోన్‌లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సేల్ నిమిత్తం 4, 23,000 మంది రిజిస్టర్ అయినట్లు కంపెనీ తెలిపింది.

లీ 1ఎస్ రికార్డ్ సేల్, 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు

లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ మూడవ సేల్ కూడా విజయవంతమవటంతో హ్యాట్రిక్ విజయాలను లీఇకో సంస్థ సొంతం చేసుకుంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నెల రోజులలోపే అనితర సాధ్యమైన సంచలనాలను లీఇకో సంస్థ నమోదు చేసింది. లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ సాధించిన మైలురాళ్లను పరిశీలించినట్లయితే.

లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు నిర్వహించిన 3 ఫ్లాష్ సేల్స్‌కు గాను 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఈ 3 ఫ్లాష్ సేల్స్‌కు గాను రిజిస్టర్ అయిన వినయోగదారుల సంఖ్య 20,28,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓపెన్ సేల్ పై లీ మాక్స్

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

లీఇకో నుంచి విడుదలైన హైఎండ్ ఫోన్ లీ మాక్స్ ఓపెన్ సేల్ పై ఈకామర్స్ మార్కెట్లో దొరుకుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

లీఇకో నుంచి విడుదలైన సూపర్‌ఫోన్స్ ఇండియన్ యూజర్లను అన్నివిధాలుగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

టాప్ 3లో నిలవాలన్నదే సంకల్పం

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

దేశవ్యాప్తంగా తన కస్టమర్ బేస్‌ను మరింతగా పెంచుకుని టాప్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలవాలన్నది లీఇకో సంకల్పంగా తెలుస్తోంది.

ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్‌గా

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

లీ 1ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్‌గా నిలవటంతో లీఇకో ఇండియా స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీఓఓ అతుల్ జైన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లీ 1ఎస్‌కు తోడు లీ మాక్స్ ఫోన్ అమ్మకాలు కూడా మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తాయని ఆయన థీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన ఆకర్షణ

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

రూ.10,999 ధర ట్యాగ్‌తో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న లీ 1ఎస్ ఫోన్ పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. మిర్రర్ సర్ ఫేసుడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

డివైస్ స్పెక్స్ విషయానికొస్తే...

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

డివైస్ స్పెక్స్ విషయానికొస్తే... 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, హీలియో ఎక్స్10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

డివైస్ స్పెక్స్ విషయానికొస్తే...

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.

క్విక్ ఛార్జ్ టెక్నాలజీ

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

ఈ ఫోన్‌లో పొందుపరిచిన క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 5 నిమిషాలకు 3.5 గంటల టాక్ టైమ్‌ను ఇస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ చార్జింగ్ కోసం పరితపించే బిజినెస్ ప్రొఫెషనల్స్ కు ఈ సదుపాయం మరింతగా ఉపయోగపడుతుంది.

షాపింగ్ కార్నివాల్ - లీఇకో డే

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

లీఇకో ఫోన్‌లను ఇప్పటి వరకు సొంతం చేసుకోలేకపోయిన వారు ఫిబ్రవరి 25న ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే షాపింగ్ కార్నివాల్ - లీఇకో డేలో పాల్గొని లీ 1ఎస్ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు.

555 సర్వీస్ సెంటర్లు

ఇండియన్ మార్కెట్లో లీఇకో ప్రభంజనం

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాపత్ంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco leads industry with three consecutive record flash sales. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot