LeEcoతో చేతులు కలిపిన Jio
తమ సూపర్‌ఫోన్ యూజర్లకు "Jio Welcome Offer"ను అందించేందుకు, ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ LeEco రిలయన్స్ జియోతో చేతులు కలిపింది.

దీంతో Le 1s, Le 1s Eco, Le 2, Le Max, Le Max 2 ఫోన్‌లకు జియో వెల్‌కమ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చేసింది. లీఇకో యూజర్లు తమ ఫోన్‌లలో జియో సిమ్‌లను యాక్టివేషన్ చేసుకోవటం ద్వారా డిసెంబర్ 31,2016 వరకు జియో అందిస్తోన్న అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఆ తరువాత బెస్ట్ జియో ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

#1
జియో ఆఫర్ చేస్తున్న VoLTE కాల్స్‌ను Le 2, Le Max యూజర్లు తమ ఫోన్‌లలో ఉన్న ఎల్టీఈ నెట్‌వర్క్ పై హైడెఫినిషన్ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు.

#2
మొదటి జనరేషన్ లీఇకో సూపర్ ఫోన్‌లను వాడుతోన్న Le 1s, Le 1s Eco, Le Max యూజర్లు Jio Join app ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవల్సి ఉంటుంది.

#3
తన సంచలనాత్మక సూపర్‌ఫోన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చిన LeEco అదే ఊపుతో ముందుకు సాగుతోంది. తన లీ1ఎస్ స్మార్ట్‌పోన్ ఆవిష్కరణతో జనవరి, 2016లో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన లీఇకో ఆ తరువాత వెనక్కితిరిగి చూడలేదు. ఇటీవల లీఇకో తన సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది.

#4
లీఇకో తన అన్ని సూపర్‌ఫోన్‌లను ఏడాది ఉచిత లీఇకో కంటెంట్ మెంబర్‌షిప్ సబ్‌స్ర్కిప్షన్‌తో లీఇకో అందిస్తోంది. రూ.4,999 విలువ చేసే ఈ ఉచిత ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

#5
ఈ Supertainment మెంబర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్లు 2000కే సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు, 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. Eros Now, YuppTV, Hungama Musicల భాగస్వామ్యంతో లీఇకో ఈ సేవలను అందిస్తోంది.

#6
తమ వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

#7
"Jio Welcome Offer"ను లిఇకో ఫోన్‌లలో పొందటం ఎలా..?
ముందుగా MyJio applicationను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. తదుపరి సూచనలను అనసరించటం ద్వారా ఈ యాప్ coupon codeను జనరేట్ చేస్తుంది.

#8
ఆ కోడ్‌తో పాటు మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా ఈ-కెవైసీ డాక్యుమెంట్‌లను తీసుకుని సమీపంలో రిలియన్స్ షోరూమ్‌కు వెళ్లినట్లయితే మీకు జియో సిమ్ ఇష్యూ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications








