LeEco ఫోన్.. ఇప్పుడు కొత్త వేరియంట్‌లో

|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లీఇకో తన Le 2 ఫోన్ కు సంబంధించి "MyGrey" వేరియంట్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటి ఈ డివైస్ రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ అయిన గ్రే కలర్ వేరియంట్ క్లాసిక్ ఇంకా కూల్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. సొగసైన కటింగ్ ఎడ్జ్ డిజైన్‌తో డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది.

 LeEco ఫోన్.. ఇప్పుడు కొత్త వేరియంట్‌లో

బెస్ట్ క్లాస్ ఫీచర్లతో వస్తోన్న లీఇకో లీ2 సూపర్‌ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ ఫుల్ మెటల్ బాడీ ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేలో పొందుపరిచిన బ్లు లైట్ ఫిల్టర్ టెక్నాలజీ కంటి అలసటను తగ్గిస్తుంది. సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ భరించగలిగే పాకెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తి పైసా వసూల్‌గా అభివర్ణించవచ్చు.

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్...

ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్...

లీ2 ఫోన్ ఇంటర్నల్ పనితీరును విశ్లేషించినట్లయితే, డివైస్‌లో అమర్చిన Qualcomm® SnapdragonTM 652 (MSM8976) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి అంశాలు నునుపైన పనితీరును అందిస్తాయి.

Android M

Android M

Android M ఆధారంగా అభివృద్థి చేసిన EUI 5.8 ఆపరేటింగ్ సిస్టం పై లీ2 ఫోన్ రన్ అవుతుంది.

శక్తివంతమైన బ్యాటరీ

శక్తివంతమైన బ్యాటరీ

హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన 3000 ఎమ్ఏహెచ్ సుధీర్ఘమైన బ్యాకప్‌ను చేరువచేస్తుంది.

సూపర్ కెమెరా...

సూపర్ కెమెరా...

ఫోన్ కెమెరా విభాగాన్ని పరిశీలించినట్లయితే, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు అసాధారణ పనితీరును కనబరుస్తాయి.

4.3 కన్స్యూమర్ రేటింగ్‌

4.3 కన్స్యూమర్ రేటింగ్‌

ఫ్లిప్‌కార్ట్‌లో లీ2 ఫోన్‌లను కొనుగోలు చేసిన యూజర్లు ఈ డివైస్‌కు 4.3 కన్స్యూమర్ రేటింగ్‌ను ఇవ్వటం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లీ2 ఫోన్‌లో ఏర్పాటు చేసిన USB Type C , CDLA వంటి కనెక్టువిటీ స్టాండర్ట్స్ నవశకానికి నాందిగా నిలిచాయి.

లీఇకో గురించి..

లీఇకో గురించి..

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. 

లీఇకో గురించి..

లీఇకో గురించి..

Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

లీఇకో గురించి

లీఇకో గురించి

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి.

లీఇకో గురించి

లీఇకో గురించి

చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
LeEco’s Le 2 to debut in ‘My Grey’ Color Variant. Read More in Telugu Gizbot....
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X