కనీవినీ ఎరగని డిస్కౌంట్‌లతో LeEco షాపింగ్ ఫెస్టివల్స్

స్పెషల్ డిస్కౌంట్స్.. 100% క్యాష్ బ్యాక్స్.. లీమాల్ కూపన్స్ వంటి ప్రత్యేక ఆఫర్లతో కూడిన ఒక్క రోజు షాపింగ్ కార్నివాల్‌ను ఈ ఆగష్టు నుంచి రెగ్యులర్ బేసిస్‌లో నిర్వహించబోతున్నట్లు LeEco ప్రకటించింది.

కనీవినీ ఎరగని డిస్కౌంట్‌లతో LeEco షాపింగ్ ఫెస్టివల్స్

'LeMall for All' పేరుతో జరగనున్న ఈ షాపింగ్ పండుగను లీఇకో అఫీషియల్ ఈ-కామర్స్ వైబ్‌సైట్ అయిన LeMall.com నిర్వహిస్తుంది. ఈ ఆఫర్స్ డే రోజున LeEco సూపర్‌ఫోన్‌లతో పాటు కంపెనీ ఆఫర్ చేసే టీవీలు ఇంకా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై భారీ డిస్కౌంట్‌లు అందిస్తారు. లక్కీ డ్రాలో ఎంపికైన విజేతలకు 100% క్యాష్ బ్యాక్‌ను అందించటం జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టి

లీ 1ఎస్, లీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన LeEco ఆ తరువాత వెనక్కితిరిగి చూసుకోలేదు. ఈ ఫోన్‌లు ఊహించని సంఖ్యలో అమ్ముడుపోవటంతో లీ1ఎస్ ఇకో, లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌లను లీఇకో మార్కెట్లో లాంచ్ చేసింది. అంతేకాకుండా, సూపర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో కూడిన ప్రత్యకమైన కంటెంట్ ఇకో సిస్టంను కూడా లీఇకో

అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

LeMall గురించి క్లుప్తంగా...

ఈ-కామర్స్ ఛానల్ అయిన LeMall.comను తొలత చైనా మార్కెట్లో 2013లో LeEco చేసింది.

చైనాతో పాటు అమెరికాలో కూడా పాపులర్

చైనా ప్రధాన భూబాగంతో పాటు అమెరికా, హాంగ్ కాంగ్ దేశాల్లో లీమాల్.కామ్‌కు మంచి పాపులారిటీ ఉంది.

 

భారత్‌లో...

భారత్‌లో LeMall.comను జూన్ 2016లో ప్రారంభించారు.

ఆధునిక లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా

నెటిజనులకు సౌకర్యవంతమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతులను అందించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన లీమాల్ ఇండియా ఆధునిక లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా హైక్వాలిటీ లీఇకో గాడ్జెట్‌లను అందిస్తోంది.

 

LeMall ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో దొరికేవేంటి..?

LeMall ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లీఇకోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, బ్లూటూత్

స్పీకర్లు అందుబాటులో ఉంటాయి.

 

లీఇకో గురించి క్లుప్తంగా..?

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

 

లీఇకో గురించి క్లుప్తంగా..

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి.

 

ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో

చైనాలోని బీజింగ్‌లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco's LeMall to introduce shopping carnival day in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot