పండుగ చేసుకుంటున్న LeEco, క్వాల్కమ్

LeEco, క్వాల్కమ్ టెక్నాలజీస్ కాంభినేషన్‌లో మార్కెట్లో లాంచ్ అయిన లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్స్ ఆకట్టకునే పనితీరుతో పాజిటివ్ మార్కెట్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. క్వాల్కమ్ ప్రాసెసర్ల హైక్వాలిటీ పనితీరుకు పూర్తి న్యాయం చేకూర్చే విధంగా డిజైన్ చేయబడిన లీఇకో సూపర్ ఫోన్స్ ఎక్కడా డ్రాప్ కాని ప్రాసెసింగ్ వేగంతో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేస్తున్నాయి.

Read More : రూ.1900కే LeEco సూపర్‌ఫోన్, ఏలా అంటారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ మొబైలింగ్ విభాగంలో నవశకం

ఫీచర్ రిచ్ Qualcomm® Snapdragon ప్రాసెసర్‌లకు వరల్డ్ క్లాస్ డిజైన్‌తో పాటు విప్లవాత్మక CDLA, శక్తివంతమైన కెమెరా ఇంకా ఇన్నోవేటివ్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లను జత చేసి అభివృద్థి చేయబడిన లీఇకో సూపర్‌ఫోన్స్ స్మార్ట్‌ మొబైలింగ్ విభాగంలో నవశకానికి నాంది పలికాయి.

సూపర్ స్మూత్ మల్టీటాస్కింగ్‌

ప్రీమియమ్ క్వాలిటీ స్పెక్స్‌తో వస్తోన్న లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్స్ ద్వారా హైక్వాలిటీ పనితీరును ఆశించవచ్చు. లీఇకో ఫోన్‌లలో పొందుపరిచిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లు సూపర్ స్మూత్ మల్టీటాస్కింగ్‌ను చేరువ చేస్తుంది.

అన్ని పనులు చకాచకా..

లీఇకో సూపర్‌ఫోన్‌లలో మ్యూజిక్ వినటం, మొయిల్స్ పంపుకోవటం, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవటం, మెసేజ్‌లను పంపుకోవటం వంటి పనులు చకచకా జరిగిపోతుంటాయి.

సరికొత్త ఆలోచనలతో

స్మార్ట్‌ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత శక్తివంతం చేసే క్రమంలో క్వాల్కమ్, లీఇకో జోడి సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చాయి.

సూపర్‌ఫోన్‌లకు సరైన జోడి

లీఇకో సెకండ్ జనరేషన్ సూపర్‌ఫోన్‌లకు క్వాల్కమ్ టెక్నాలజీస్ సమకూర్చిన octa-core Snapdragon 652, quad-core Snapdragon 820 ప్రాసెసర్లు నమ్మకమైన పనితీరును కనబరుస్తూ పర్‌ఫెక్ట్ కాంభినేషన్‌లుగా నిలిచాయి.

 

కాంభినేషన్ విజయవంతమవటంతో..

లీఇకో, క్వాల్కమ్ టెక్నాలజీస్ కాంభినేషన్ భారత్‌లో విజయవంతం అవటం పట్ల రెండు కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి.

లీఇకో గురించి క్లుప్తంగా

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు. ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LeEco Works with Qualcomm to offer smooth running devices, loaded with content service. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot