ఆపిల్ కొనలేక పోతున్నారా ఐతే మీకోసం లెమన్ ఉంది..!!

Posted By: Super

ఆపిల్ కొనలేక పోతున్నారా ఐతే మీకోసం లెమన్ ఉంది..!!

ఆపిల్ ఫోన్ కొనలేని కస్టమర్స్‌కి శుభవార్త. దేశంలోని మిడల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్‌ని దృష్టిలో పెట్టుకొని లెమన్ మొబైల్స్ కంపెనీ కూల్ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. లెమన్ విడుదల చేయనున్న ఆ మొబైల్ పేరు లెమన్ డుయో 419. గతంలో చాలా మొబైల్స్‌ని విడుదల చేసిన లెమన్ మొబైల్స్ సంస్ద తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ అందించేటటువంటి మొబైల్స్‌ని లెమన్ డుయో 419 మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల యూజర్స్ హార్షం వ్యక్తం చేశారు.

లెమన్ మొబైల్స్ విడుదల చేసిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్‌‍ని క్రియేట్ చేస్తుందని లెమన్ అఫీసియల్స్ తెలిపారు. ఇండియన్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో ఈ మొబైల్‌ని విడుదల చేయడం జరిగింది. లెమన్ డుయో 419 ఫోన్ 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో పాటు, క్వాలిటీ ఇమేజి క్యాప్చరింగ్ తీయగలిగే సామర్ద్యం ఉన్న ఫోన్. రికార్డింగ్ ఫ్రీగా తీసేందు కోసం ఇందులో హై ఫెర్పామెన్స్ వీడియో ప్లేయర్‌ని రూపోందించడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ కోసం ఎఫ్‌ఎమ్ రేడియో ఉండగా, రాత్రుళ్లు బయటకు వెల్లడానికి ఎల్‌ఈడి టార్చ్ ప్రత్యేకం.

కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, జిపిఆర్‌ఎస్, డబ్ల్యుఎపి లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే మొబైల్ ట్రాకర్. దీని సహాయంతో మొబైల్ ఎప్పుడైనా దొంగిలించబడ్డా లేక పోగొట్టుకున్నా ఈజీగా కనుక్కోవచ్చు. లెమన్ డుయో 419 ఆటో కాల్ రికార్డింగ్ ఆఫ్షన్‌ని కూడా కలిగి ఉంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడం కోసం 2.4 ఇంచ్ స్క్రీన్ సైజుతో పాటు టిఎప్‌టి డిస్ ప్లే దీని సోంతం. మార్కెట్లో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా అదే మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 8జిబి వరకు విస్తరించుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఆడియోని బయట స్పీకర్స్‌కు కనెక్టు చేసుకునేందుకు 3.5 mm ఆడియో జాక్ ఉచితం. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న దీని ధర సుమారుగా రూ 4,000లోపే ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot