మార్కెట్లోకి రానున్న లెమన్ టచ్ స్ర్కీన్ బ్రాండ్

Posted By: Staff

మార్కెట్లోకి రానున్న లెమన్ టచ్ స్ర్కీన్ బ్రాండ్

మన్నికతో పాటు సమజంసమైన ధరలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న లెమన్ మొబైల్స్, భారతీయ మొబైల్ కంపెనీల్లో ఒకటి. ఇప్పటికే పలు మోడళ్ల మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టిన ఈ కంఫర్ట్ బ్రాండ్ పోటీ బ్రాండ్లకు పోటీగా నిలుస్తుంది. ప్రస్తుత మొబైల్ ప్రపంచంలో మారుతున్న ట్రెండ్లను దృష్టిలో ఉంచుకున్న లెమన్ బ్రాండ్ టచ్ స్ర్కీన్ మొబైల్ లెమన్ iT414ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. జీఎస్ఎమ్ సామర్థ్యంతో మెటాలిక్ బాడీతో రూపుదిద్దుకుంటున్నఈ క్లాసికల్ మొబైల్ నలుపు రంగులో తుదిమెరుగులు దిద్దుకుంటుంది.

ఈ ఫోన్ కు సంబంధించి ప్రత్యేక ఆకర్షణలను పరిశీలిస్తే 1.3 మెగా పిక్స్ ల్ సామర్థ్యం కలిగిన కెమెరా 1280 * 1024 రిసల్యూషన్ కలిగి ఉంటుంది. డిజిటల్ జూమ్ తో వీడియో రికార్డింగ్ చేసుకునే సౌలభ్యత ఈ మొబైల్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ఎంటర్ టెయిన్ మెంట్ కు ప్రాధాన్యతనిచ్చిన ఈ కంఫర్ట్ బ్రాండ్ వీడియో ప్లేయర్ తో పాటు ఆడియో ప్లేయర్ లను క్వాలటీతో రూపొందించింది. ఈ మొబైల్లో 8 జీబీ వరకు మెమరీని పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించారు.

టచ్ స్ర్కీన్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న లెమన్ iT414 2.8 అంగుళాల టీఎఫ్ టీ విస్తీర్ణం కలిగిఉంది. జీపీఆర్ఎస్, ఎఫ్ఎం రేడియోలు అదనం. 3.5mm కలిగిన ఆడియో జాక్ లు, హెడ్ ఫోన్లు, స్పీకర్లతో పాటు యూఎస్ బీ పోర్టు ద్వారా కంప్యూటర్ కు జత చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఆకర్షణీయమైన గేమ్స్, బ్లూటూత్, మొబైల్ ట్రాకర్, ఆటో కాల్ రికార్డు, ఎఫ్ఎమ్ రికార్డింగ్ లతో పాటు ఎమ్ఎమ్ఎస్ మెసేజింగ్ ఆప్షన్లు ఈ మొబైల్ లో పొందు పరిచారు. సామాన్య, మధ్యతరగతి శ్రేణులను దృష్టిలో ఉంచుకుని లెమన్ మొబైల్స్ ప్రవేశపెడుతున్న టచ్ స్ర్కీన్ లెమన్ iT414 మార్కట్లో ఎంత పోటీనిస్తుందో చూద్దాం.

Lemon iT414 provides additional features:

Inbuilt Games which can attract young users
Bluetooth connectivity
Mobile tracker helps to locate the mobile phone in case of misplacement or theft
Auto call record
FM recording
MMS facility in addition to standard SMS messaging options

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting