నిమ్మ మాదిరే కమ్మదనాన్ని అందించే 'లెమన్ టి359'

Posted By: Super

నిమ్మ మాదిరే కమ్మదనాన్ని అందించే 'లెమన్ టి359'

లెమన్ మొబైల్స్ ఇటీవల ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి బెస్ట్ హ్యాండ్ సెట్స్‌ని అతి తక్కువ ధరలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. లెమన్ మొబైల్స్ విడుదల చేసిన హ్యాండ్ సెట్స్ హై ఫెర్పామెన్స్‌ని ప్రదర్శించడంలో ముందంజలో ఉన్నాయి. యూజర్స్ యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్లయొక్క అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్‌ని తయారుచేస్తుంది. కొత్తగా లెమన్ మొబైల్స్ నుండి విడుదలవుతున్న మొబైల్ లెమన్ టి359. టి359 మొబైల్‌ని డ్యూయల్ సిమ్ విభాగంలో లెమన్ కంపెనీ విడుదల చేయనుంది. వీటితో పాటు డ్యూయల్ మొమొరీ కార్డుతో పాటు హాట్ స్వాప్ సపోర్ట్ ఫెసిలిటీ, 8జిబి డేటా స్టోరేజి సపోర్ట్‌ని లెమన్ టి359 అందిస్తుంది.

యూజర్స్‌‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లేతో పాటు 320 X 240 ఫిక్సల్ రిజల్యూషన్‌ని అందిస్తుంది. 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం వల్ల యాజర్స్ చక్కని ఇమేజిలను తీయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్‌ ఏమిటంటే ఇమేజిని ఎడిటింగ్ చేసే అవకాశం కూడా ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. రాత్రి పూట చీకటి సమయంలో యూజర్స్ ఎక్కడికైనా వెళ్లేందుకు అనుగుణంగా ఇందులో ఎల్‌ఈడి టార్చ్‌ని కూడా పొందుపరచడం కూడా జరిగింది.

ఇటీవల కాలంలో లెమన్ మొబైల్స్ విడుదల చేస్తున్న అన్ని రకాల మొబైల్స్‌లలో దొంగతనానికి గురి కాకుండా మొబైల్ ట్రాకర్ ఫీచర్‌తో రూపోందించడం జరుగుతుంది. మొబైల్ నుండి డేటాని ట్రాన్ఫర్ చేసేందుకు ప్రత్యేకంగా ఇందులో బ్లూటూత్ ఫీచర్‌ని అందుబాటులో ఉంచారు. వీటితోపాటు GPRS/WAP లాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం.

లెమన్ టి359 మొబైల్ ఫీచర్స్:

Network: 2G
Dual SIM GSM
Display: 2.4-inch TFT display
320 x 240 pixels screen resolution
1.3 MP camera
Video Player/Recorder
Music Player
FM Radio
3.5 mm jack
Internal memory
Up to 8 GB Dual Memory Card Slot
LED Torch light, Mobile Tracker
Bluetooth, WAP data connectivity
Battery: 1800mAh standard

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot