35 లక్షల పాటలు ఫ్రీగా వినే అవకాశం!

తన సెకండ్ జనరేషన్ లీ2, లీ మాక్స్2 సూపర్ ఫోన్ లను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసి సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన లీఇకో లీమ్యూజిక్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

35 లక్షల పాటలు ఫ్రీగా వినే అవకాశం!

లీఇకో సూపర్ ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను ఆన్‌ద‌ఎయిర్ అప్‌డేట్ రూపంలో పొందుతున్నారు. తొలత లీ2, లీమాక్స్2కు ఫోన్‌లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంచటం జరిగింది. ఈ యాప్‌ను పొందటం ద్వారా నెలకు రూ.99 ఛార్జ్ చేయబడే హంగామా మ్యూజిక్ ప్రో సబ్‌స్ర్కిప్సన్‌ను 12 నెలల పాటు ఉచితంగా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సబ్‌స్ర్కిప్షన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే

ఈ సబ్‌స్ర్కిప్సన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే 25 భారతీయ భాషలతో పాటు 10 అంతర్జాతీయ భాషలకు సంబంధించి 3.5 మిలియన్ల పాటలను యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

సూపర్ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీలో

వీటిలో 2.5 మిలియన్ల పాటలు ఫుల్ హైడెఫినిష్ క్వాలిటీలో అందుబాటుల ఉంటాయి. వీటిని సూపర్ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీలో ఆస్వాదించవచ్చు. లీఇకో సూపర్‌ఫోన్ యూజర్ ఈ మ్యూజిక్‌ను ఆఫ్‌లైన్‌లోనూ ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడ్‌కు అనుగుణంగా కంటెంట్ ప్రోగ్రామ్‌

లీమ్యూజిక్ యాప్ ద్వారా యూజర్ తను ఉన్న మూడ్‌కు అనుగుణంగా కంటెంట్ ప్రోగ్రామ్‌ను సెట్ చేసుకోవచ్చు. అంటే, ఒకవేళ మీరు పార్టీ మూడ్‌లో ఉన్నట్లయితే ఆ మూడ్‌కు సంబంధించి మ్యూజిక్ ప్లేలిస్ట్ జాబితాలోకి చేరుతుంది.

3జీ, 2జీ నెట్‌వర్క్‌లలోనూ..

లీమ్యూజిక్ యాప్‌లో ఏర్పాటు చేసిన అడాప్టివ్ స్ట్రీమింగ్ ఫీచర్ ద్వారా యూజర్ తనకు నచ్చిన పాటలతో పాటు వీడియోలను వై-ఫై, 3జీ, 2జీ నెట్‌వర్క్‌లలో సౌకర్యవంతంగా ఆస్వాదించవచ్చు.

సీడీఎల్ఏ స్టాండర్డ్ టెక్నాలజీ

డిజిటల్ ఆడియో క్వాలిటీని చేరువచేసే క్రమంలో లీఇకో తన సూపర్ ఫోన్ లలో ప్రపంచపు మొట్టమొదటి సీడీఎల్ఏ స్టాండర్డ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సాంప్రదాయ 3.5ఎమ్ఎమ్ జాక్ స్థానంలో ఈ టెక్నాలజీ ఉంటుంది.

 

యాప్ ఇంటిగ్రేషన్

హంగామా మ్యూజిక్ యాప్ ఇంటిగ్రేషన్ అనేది లీఇకో ఆఫర్ చేస్తున్న సూపర్ టెయిన్ మెంట్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా వస్తోంది. లీఇకో హ్యాండ్ సెట్ లను కొనుగోలు చేసే ప్రతిఒక్కరికి ఈ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ఉచితంగా లభిస్తుంది.

సూపర్‌టెయిన్‌మెంట్ ప్యాకేజీ

రూ.4999 విలువ చేసే ఈ ఉచిత సూపర్‌టెయిన్‌మెంట్ ప్యాకేజీ ద్వారా యూజర్లు అనేక సర్వీసులను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 2000కు పైగా సినిమాలు, 3.5 మిలియన్ల పాటలు ఇంకా 150 పై చిలుకు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
LeMusic all set to elevate the music experience on LeEco Superphones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting