లెనోవో ఏ536 స్మార్ట్‌ఫోన్@రూ.9,499
చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన లెనోవో ఇటీవల తన వైబ్ సిరీస్ నుంచి పలు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసి మంచి గుర్తింపును సొంతం చేసుంది. తాజాగా, బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన లెనోవో తన ఏ సిరీస్ నుంచి A526 పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ ధర రూ.9,499. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను అన్ని లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో విక్రయించనున్నారు. ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

ఫోన్ బరువు 145 గ్రాములు,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications