Home
Mobile

లెనోవో లేటెస్ట్ ఎంట్రీ...!!!

By Prashanth
Lenovo A60 Android Smartphone


హై క్వాలిటీ ల్యాప్‌టాప్స్ అదే విధంగా డెస్క్‌టాప్ కంప్యూటర్ల మార్కెట్‌ను శాసిస్తున్న లెనోవో ( Lenovo) తాజగా మొబైల్ ఫోన్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఆధారిత ‘లెనోవో A60’ స్మార్ట్ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఆడ్వాన్సుడ్ స్సెసిఫికేషన్లతో రూపొందించబడిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా...

ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్‌ సిస్టం పై మొబైల్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 650 MHz ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్‌లు వేగవంతమైన కంప్యూటింగ్‌కు సహకరిస్తాయి. డ్యూయల్ సిమ్ సౌలభ్యత, 3.5 అంగుళాల స్ర్క్రీన్ డిస్‌ప్లే మల్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. కెమెరా సామర్ధ్యం 3.2 మెగా పిక్సల్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్ 2.0 తదితర అంశాలను మొబైల్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఫోన్‌లో 3.5G HSDPA టెక్నాలజీని నిక్షిప్తం చేయ్యటం వల్ల డౌన్‌లోడ్ స్పీడ్ 7.2 Mbps వరకు ఉంటుంది. వైట్, బ్లాక్, బ్లూ, పర్పిల్ రంగుల్లో ఈ డివైజులు లభ్యంకానున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి వస్తే ఫోన్లో ఆడియో, వీడియో ప్లేయర్‌లను ఏర్పాటు చేశారు. MP3, MPEG4, AAC, WMA తదితర ఫార్మాట్లను ఈ ప్లేయర్లు సపోర్ట్ చేస్తాయి. ఎస్ఎమ్ఎస్, ఎమ్ఎమ్ఎస్, ఈ -మెయిల్ అప్లికేషన్లను డివైజ్‌లో ముందుగానే లోడ్ చేశారు. బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X