‘లెనోవో’ కొత్త లుక్ ఏంటి..?

By Prashanth
|
Lenovo A60


హై క్వాలిటీ ల్యాప్ టాప్స్  అదే విధంగా డెస్క్ టాప్ కంప్యూటర్ల  మార్కెట్ ను  శాసిస్తున్న లెనోవో ( Lenovo) తాజగా మొబైల్ ఫోన్ సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ‘లెనోవో  A60’ని లాంఛ్ చేసింది.  ఆడ్వాన్సుడ్ స్సెసిఫికేషన్లతో

రూపొందించబడిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా...

ఆండ్రాయిడ్ 2.3 వర్షన్  జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై మొబైల్ రన్ అవుతుంది. నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 650 MHz ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ లు  వేగవంతమైన కంప్యూటింగ్ కు సహకరిస్తాయి. డ్యూయల్ సిమ్ సౌలభ్యత, 3.5 అంగుళాల స్ర్క్రీన్ డిస్ ప్లే మల్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. కెమెరా సామర్ధ్యం 3.2 మెగా పిక్సల్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్ 2.0 తదితర అంశాలను మొబైల్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని పెంచుతాయి.

ఫోన్ లో 3.5G HSDPA టెక్నాలజీని నిక్షిప్తం చేయ్యటం వల్ల డౌన్ లోడ్ స్పీడ్ 7.2 Mbps వరకు ఉంటుంది. వైట్, బ్లాక్, బ్లూ, పర్పిల్ రంగుల్లో ఈ డివైజులు లభ్యమవుతున్నాయి. ఫోన్ చుట్టు కొలతల  విషయానికొస్తే 116.5 x 59.9 x 13.2 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి ఉంటుంది.

ఇక ఎంటర్ టైన్ మెంట్ విభాగానికి వస్తే ఫోన్లో ఆడియో మరియు వీడియో ప్లేయర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. MP3, MPEG4, AAC, WMA తదితర ఫార్మాట్లను ఈ ప్లేయర్లు సపోర్ట్ చేస్తాయి. ఎస్ఎమ్ఎస్, ఎమ్ఎమ్ఎస్, ఈ -మెయిల్  అప్లికేషన్లను ముందుగానే  లోడ్ చేశారు. బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X