భారత్‌లోకి లెనోవో 4జీ ఫోన్.. అతి త్వరలో

|
భారత్‌లోకి లెనోవో 4జీ ఫోన్.. అతి త్వరలో

‘లెనోవో ఏ6000' పేరుతో 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కూడిన సరికొత్త 4జీ స్మార్ట్‌‌ఫోన్‌ను లెనోలో సీఈఎస్ 2015లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. భారత్ మార్కెట్లో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్ విడుదలకు సంబంధించి కీలక సమచారాన్ని గిజ్‌బాట్ సేకరించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ జనవరిలోనే మార్కెట్లో లభ్యంకానున్న లెనోవో ఏ6000 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఈ ఫోన్ ధర రూ.10,000 కన్నా తక్కువే ఉండొచ్చు.

భారత్‌లోకి లెనోవో 4జీ ఫోన్.. అతి త్వరలో

లెనోవో ఏ6000 ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎంఎస్ఎమ్8916 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, వైబ్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యుయల్ మైక్రోసిమ్, 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ, బ్లూటూత్, ఫోన్ బరువు 128 గ్రాములు, చుట్టుకొలత 141 x 70 x 8.2 మిల్లీ మీటర్లు.

Best Mobiles in India

English summary
Lenovo A6000 India Launch Event Invites Are Ready: Specs and More. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X