2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ7000, ధర రూ.8,999

Posted By:

ఆండ్రాయిడ్ లాలీపాప్, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్ లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను గతకొంత కాలంగా ఊరిస్తోన్న లెనోవో ఏ7000 స్మార్ట్ ఫోన్ మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.8,999.

2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ7000, ధర రూ.8,999

ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. భారత్‌లో ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 15, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతంది. ఈ ఫ్లాష్ సేల్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పేజీని ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రారంభించింది.

లెనోవో ఏ7000 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

2జీబి ర్యామ్‌తో లెనోవో ఏ7000, ధర రూ.8,999

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ (ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

English summary
Lenovo A7000 launched in India Price Rs. 8,999. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot