Lenovo నుంచి మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్ !

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది స్మార్ట్‌ఫోన్లే అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 2జీ నుంచి 3జీకి కాలం పరిగెడితే అక్కడి నుంచి అంతే వేగంతో 4జీకి పరుగులు పెట్టింది.

By Anil
|

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది స్మార్ట్‌ఫోన్లే అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. 2జీ నుంచి 3జీకి కాలం పరిగెడితే అక్కడి నుంచి అంతే వేగంతో 4జీకి పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు 4జీ నుంచి 5జీ వైపు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 5జీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.అయితే ముందుగా ఏ కంపెనీ ఈ 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుందనే దానిపై అనేక అంచనాలు నెలకొన్న నేపథ్యంలో Lenovo కంపెనీ ఓ అడుగు ముందుకేసింది.ఈ సంవత్సరం చివరి నెలలో లేదా 2019 జనవరిలో అయిన తమ ఫస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తునట్టు Lenovo కంపెనీ ప్రెసిడెంట్ Chang Cheng తెలిపారు.

మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ....

మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ....

స్మార్ట్ ఫోన్ ప్రపంచం లోకి రాబోతున్న మొట్ట మొదటి 5జీ స్మార్ట్ ఫోన్ తమ కంపెనీదే అని Lenovo కంపెనీ ప్రెసిడెంట్ Chang Cheng తెలిపారు.

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855....

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855....

లెనోవో నుంచి రాబోతున్న 5జి స్మార్ట్ ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన Snapdragon X16 LTE మోడెమ్ వేగవంతమైన కనెక్టువిటీని ఆఫర్ చేస్తుంది అని Lenovo కంపెనీ ప్రెసిడెంట్ Chang Cheng తెలిపారు

2018 డిసెంబర్ లేదా 2019 జనవరి....

2018 డిసెంబర్ లేదా 2019 జనవరి....

కాగా తమ 5జి స్మార్ట్ ఫోన్ ను ఈ సంవత్సరం చివరి నెలలోనైనా లేదా 2019 జనవరి నెలలోనైనా విడుదల చేయబోతున్నట్టు Chang తెలిపారు.

 Lenovo Z5 గురించి ఈ విధంగా.....

Lenovo Z5 గురించి ఈ విధంగా.....

అయితే Lenovo Z5 టీజర్ రిలీజ్ చేసినప్పుడు notch-less display, mammoth battery తో ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా చివరికి ఆ ఫోన్ display notch మరియు 3300mAh battery తో విడుదల చేసినట్టు Chang తెలిపారు.అయితే ఈ పొరబాటు తమ రాబోయే 5జీ ఫోన్ లో చేయమని అయన తెలిపారు.

2019 లో మరిన్ని కంపెనీల  5జీ స్మార్ట్ ఫోన్లు.....

2019 లో మరిన్ని కంపెనీల 5జీ స్మార్ట్ ఫోన్లు.....

అయితే వచ్చే సంవత్సరం 2019 ఫస్ట్ క్వార్టర్ లో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలైన Oppo, Huawei మరియు OnePlus కంపెనీలు తమ 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తునట్టు ప్రకటించారు.కాగా Samsung Galaxy S10 కూడా 5జీ కనెక్టివిటీ తో వస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

 

 

 

Best Mobiles in India

English summary
Lenovo to Be First to Launch 5G Smartphone With Snapdragon 855 SoC, Executive Claims.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X