ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన Lenovo Days సేల్

ఇండియన్ మార్కెట్లో మూడు సంవత్సరాల తమ భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని లెనోవో, ఫ్లిప్‌కార్ట్‌లు సంయుక్తంగా రెండు రోజుల 'Lenovo Days Sale'ను మంగళవారం ప్రారంభించాయి. ఈ సేల్‌లో భాగంగా లెనోవోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ అలానే యాక్సెసరీస్ పై రూ.2000 వరకు డిస్కౌంట్‌లను అందుబాటులో ఉంచారు.

Read More : జియో సిమ్ ఎప్పటి వరకు పని చేస్తుంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ ద్వారా...

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ అలానే ఫ్లిప్‌కార్ట్ లైట్ యాప్‌లలో లెనోవో డేస్ సేల్‌ తాలుకా ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.కొనుగోలు సమయంలో PhonePe ద్వారా చెల్లింపులు చేసిన వారికి 25% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే...

సేల్ రెండు రోజులని అనౌన్స్ చేసినప్పటికి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ‘Lenovo Days Sale'లో భాగంగా లెనోవో పీ2, లెనోవో వైబ్ కే5 నోట్, లెనోవో కే6 పవర్ వంటి లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

లెనోవో పీ2

‘Lenovo Days Sale'లో భాగంగా 5,100mAh బ్యాటరీతో వస్తోన్న లెనోవో పీ2 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.2,000 తగ్గింపుతో రూ.15,999కే సొంతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.3,000 తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ల పై రూ. 13,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

లెనోవో కే6 పవర్

‘Lenovo Days Sale'లో భాగంగా లెనోవో కే6 పవర్ 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.1,000 తగ్గింపుతో రూ.9,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఫోన్‌ పై రూ. 9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఇదే సేల్‌లో భాగంగా లెనోవో కే6 పవర్ 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.1,000 తగ్గింపుతో రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 8,500 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ కూడా అందుబాటులో ఉంచారు.

లెనోవో ఫాబ్2 ప్రో

ఈ సేల్‌లో భాగంగా లెనోవో ఫాబ్2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,000 తగ్గింపుతో రూ.27,990కే సొంతం చేసుకోవచ్చు. జనవరిలో లాంచ్ అయిన ఈ మొట్టమొదటి గూగుల్ ప్రాజెక్ట్ టాంగో స్మార్ట్ ఫోన్ కు కెమెరా టెక్నాలజీ ప్రధానమైన ఆకర్ఫణగా నిలుస్తుంది.

లెనోవో ఫాబ్ 2 ప్లస్

ఈ సేల్‌లో భాగంగా లెనోవో ఫాబ్ 2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. 6.4 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది

లెనోవో ఫాబ్ 2

ఈ సేల్‌లో భాగంగా లెనోవో ఫాబ్ 2 ప్లస్‌కు జూనియర్ వర్షన్‌గా భావిస్తోన్న లెనోవో ఫాబ్ 2 ఫోన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.

లెనోవో వైబ్ కే5 నోట్

ఇదే సేల్‌లో భాగంగా లెనోవో లెనోవో వైబ్ కే5 నోట్ 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,000 తగ్గింపుతో రూ.11,499కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఫోన్‌ పై రూ. 10,500 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ఇదే సేల్‌లో భాగంగా లెనోవో కే6 పవర్ 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ.1,000 తగ్గింపుతో రూ.10,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ కూడా అందుబాటులో ఉంచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Days Sale on Flipkart: Deals on Lenovo P2, K6 Power and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot