లెనోవో నుంచి మొట్టమొదటి ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే ఫోన్‌

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో తన మొట్టమొదటి ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. లెనోవో కే320టీ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. జేడీ.కామ్(Jd.com) అనే వెబ్‌‍సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.

 
లెనోవో నుంచి మొట్టమొదటి ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే ఫోన్‌

సేల్ జనవరి 4 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ధర చైనా మార్కెట్లో ¥999గా ఉంటుంది. మన కరెన్సీలో ఈ విలువ రూ.9,774. హారిజంటల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి హైలైట్ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

డిజైన్ అండ్ డిస్‌ప్లే

డిజైన్ అండ్ డిస్‌ప్లే

లెనోవో కే320టీ ఫోన్ పూర్తిస్థాయి పాలీకార్బోనేట్ బాడీతో వస్తోంది. వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థలు ఫోన్‌కు మరింత మోడ్రన్ లుక్‌ను తీసుకువస్తాయి. ఫోన్ ముందు భాగాన్ని పరిశీలించినట్లయితే 5.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే పర్‌ఫెక్ట్ విజువల్స్‌ను ఆఫర్ చేస్తుంది. 2.5డి కర్వుడ్ గ్లాస్, ఫోన్ డిస్‌ప్లేకు మరంత రక్షణ కవచంలా నిలుస్తుంది.

 ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్...

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌తో లభ్యమవతోన్న లెనోవో కే320టీ ఫోన్ 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు 2జీబి ర్యామ్ అటాచ్ అయి ఉంటుంది. 16జీబి స్టోరేజ్ స్పేస్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. అదిచాలకపోతే మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఎయిర్‌టెల్ టీవీ యాప్‌తో ఉచితంగా 6000 సినిమాలు వీక్షించండిఎయిర్‌టెల్ టీవీ యాప్‌తో ఉచితంగా 6000 సినిమాలు వీక్షించండి

కెమెరా, బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్
 

కెమెరా, బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంలో 8 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్లు ఈ డివైస్‌లో అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి లెనోవో కే320టీ ఫోన్ శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది.

ఇతర ఫీచర్లు...

ఇతర ఫీచర్లు...

లెనోవో కే320టీ ఫోన్ డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో లభ్యమవుతుంది. 2జీ/3జీ/4జీ, వై-ఫై, జీపీ బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. కంపాస్ మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ , యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ , గ్రావిటీ వంటి సెన్సార్స్ ఈ ఫోన్‌లో ఉంటాయి. ఫోన్ చుట్టుకొలత 155.2 x 73.5 x 8.5 మిల్లీ మీటర్లుగా ఉంటుంది. బరువు 153.8 గ్రాములు.

Best Mobiles in India

Read more about:
English summary
Lenovo has now announced its first-ever full-screen smartphone in China. Dubbed as Lenovo K320t the handset was also recently spotted on TENAA.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X