లెనోవో నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్..

Posted By: BOMMU SIVANJANEYULU

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లెనోవో కే సిరీస్ నుంచి కాగా మరొక ఫోన్ ఎస్ సిరీస్ నుంచి లాంచ్ అయ్యింది. లెనోవో ఎస్5, లెనోవో కే5, లెనోవో కే5 ప్లే మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వచ్చే వారం నుంచి ఈ నుంచి స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతాయి. చైనా మార్కెట్లో లెనోవో కే5 ధర 899 yuan (ఇండియన్ కరెన్సీలో రూ.9,254), ఇదే సమయంలో లెనోవో కే5 ప్లే ధర 699 yuan (ఇండియన్ కరెన్సీలో రూ.7195). లెనోవో ఎస్5 ధర 1199 yuan (ఇండియన్ కరెన్సీలో రూ.12354).

లెనోవో కే5 స్పెసిఫికేషన్స్..
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిష్ ప్లస్ బీజిల్ లెస్ట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ZUI 3.1 యూజర్ ఇంటర్ ఫేస్, 1.5గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి స్టోరేజ్ వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట సెన్సార్, 3,000 mAh బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మెటల్ యునిబాడీ విత్ గ్లాస్ కాంభినేషన్.

బడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు

లెనోవో నుంచి కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్..

లెనోవో కే5 ప్లే స్పెసిఫికేషన్స్..
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిష్ ప్లస్ బీజిల్ లెస్ట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ZUI 3.1 యూజర్ ఇంటర్ ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి స్టోరేజ్ వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,000 mAh బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, మెటల్ యునిబాడీ విత్ గ్లాస్ కాంభినేషన్.

లెనోవో ఎస్5 స్పెసిఫికేషన్స్...
5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 2160 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ 10 వాట్ ఛార్జింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ విత్ 4జీ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్.

English summary
Lenovo K5, K5 Play With 18:9 display, 3000mAh Battery launched: Price, specifications. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot