లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్ పై రూ.1000 తగ్గింపు
లెనోవో కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రూ.1000 తగ్గింపును ప్రకటించింది.
4జీబి ర్యామ్, 4జీ VoLTE సపోర్ట్ వంటి ప్రత్యేకతలో మార్కెట్లో సిద్ధంగా ఉన్న లెనోవో కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. ప్రస్తుత ధర రూ.12,499. లిమిటెడ్ పిరియడ్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
సోనీ Xperia X పై రూ.24,000 తగ్గింపు

హైడెఫినిషన్ డిస్‌ప్లేతో
లెనోవో వైబ్ కే5 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు.

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్
లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 4జీబి ర్యామ్ కెపాసిటీ, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై లెనోవో కే5 నోట్ రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు.

కెమెరా స్పెక్స్...
లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

4జీ VoLTE సపోర్ట్...
లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇటీవల 4జీ VoLTEకు అప్‌డేట్ చేసారు. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.


Click it and Unblock the Notifications








