అప్పుడే ‘లెనోవో కే5 నోట్’ వచ్చేసింది

Written By:

లెనోవో వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలై కొద్ది వారాలు కాకముందే దీని సక్సెసర్ వర్షన్ అయిన కే5 నోట్‌ను చైనా మార్కెట్లో లెనోవో లాంచ్ చేసింది. కే4 నోట్ తరహాలోనే కే5 నోట్‌ను కూడా ఫ్లాష్‌సేల్ ద్వారా విక్రయించనున్నారు. అయితే, ఈ ఫోన్ చైనా మార్కెట్లో మాత్రమే దొరుకుతుంది.

అప్పుడే ‘లెనోవో కే5 నోట్’ వచ్చేసింది

కే4 నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా మార్కెట్లోకి వచ్చిన కే5 నోట్ పూర్తి మెటల్ బాడీ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఈ రెండు ఫోన్‌ల మధ్యగల ప్రధాన వ్యత్యాసాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎల్టీపీఎస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. కే4 నోట్ కూడా 5.5 ఐపీఎస్ డిస్‌ప్లేతో లభ్యమవుతోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.

 

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

లెనోవో కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ ఎంటీ6755 హీలియో పీ10 సీపీయూతో కూడిన ఆక్టాకోర్ 1.8గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్‌ను పొందుపరిచారు. ఫోన్ గ్రాఫిక్స్ విభాగానికి వస్తే మాలీ-టీ860ఎంపీ2 జీపీయూను డివైస్‌లో పొందుపరిచారు. ఇదే సమయంలో కే4 నోట్ ఎంటీ6753 సీపీయూతో కూడిన ఆక్టాకోర్ 1.3బగిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. గ్రాఫిక్స్ విభాగానికి వస్తే మాలీ-టీ720ఎంపీ3 జీపీయూను డివైస్‌లో పొందుపరిచారు.

 

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

 

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

ఈ రెండు ఫోన్‌లు 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉండగా ఫ్రంట్ కెమెరా విషయంలో కే5నోట్, కే4నోట్ ను అధిగమించింది. కే5 నోట్ ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సల్ గా ఉండగా, కే4 నోట్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరాలోని ప్రత్యేకతలు : f/2.2 అపెర్చర్, ఫేస్‌డిటెక్షన్, ఆటో ఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి డ్యుయల్ టోన్ ఫ్లాష్, టచ్ ఫోకస్, హెచ్‌డీఆర్)

 

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ 2జీబి ర్యామ్ సామర్థ్యంతో కూడిన 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే సమయంలో కే4 నోట్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 2జీబి ఇంకా 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో వస్తున్న ఈ ఫోన్‌లు 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

 

లెనోవో కే5 నోట్ vs లెనోవో కే4 నోట్

కే5 నోట్ ఫోన్ 3500 ఎమ్ఏహెచ్ నాన్‌ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో కే4 నోట్ ఫోన్ 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే5 నోట్ పూర్తి స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920 పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పూర్తి మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అటామస్ సౌండ్ సిస్టం, 64 బిట్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.8గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్, మాలీ-టీ860 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ డ్యుయల్ నానో సిమ్, 3జీ, వై-పై, జీపీఆర్ఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ), చైనా మార్కెట్లో కే5 నోట్ విలువ రూ.11,350.

English summary
Lenovo K5 Note vs Lenovo K4 Note: What's The Difference?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot