Home
Mobile

లెనోవో కే6 పవర్ ఆఫర్లు వింటే షాకవ్వాల్సిందే..

లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.1499 విలువ చేసే మోటో పల్స్ 2 హెడ్‌ఫోన్‌లను కేవలం రూ.499కే సొంతం చేసుకునే అవకాశం..

By Sivanjaneyulu Bommu

కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో లెనోవో ఆసక్తికర ఆఫర్లను అనౌన్స్ చేసింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా, లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు రూ.1499 విలువ చేసే మోటో పల్స్ 2 హెడ్‌ఫోన్‌లను కేవలం రూ.499కే సొంతం చేసుకోగలుగుతారు.

Read More : మోటో జీ4 పై రూ.2,000 తగ్గింపు

రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్..

రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్..

కండీషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునే అవకాశాన్ని లెనోవో కల్పిస్తోంది. ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.8,000 వరకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంది.

100 మంది లక్కీ విజేతలకు..

100 మంది లక్కీ విజేతలకు..

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే 100 మంది లక్కీ విజేతలకు రూ.10,000 ఎలక్ట్రానిక్ గిఫ్ట్ కూపన్లను లెనోవో అందించబోతోంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గోదలచిన వారు కే6 పవర్ మెనూలో 'Notify Me' ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది.

3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌

3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌

లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో, మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999. డిసెంబర్ 6 నుంచి ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

శక్తివంతమైన ప్రాసెసర్...

శక్తివంతమైన ప్రాసెసర్...

క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.

మెటల్ యునిబాడీ డిజైన్‌...

మెటల్ యునిబాడీ డిజైన్‌...

ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్...

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్.

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్..

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్..

ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Lenovo K6 Power launch offers announced. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X