లెనోవో కే6.. రెడ్మీ నోట్ 3కి షాకివ్వబోతోందా

తన అప్‌కమింగ్ 'కే' సీరిస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు లెనోవో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇటీవల ఓ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

లెనోవో కే6.. రెడ్మీ నోట్ 3కి షాకివ్వబోతోందా

Read More : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?

లెనోవో కే6 పవర్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను లెనోవో నవంబర్ 29న మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలుస్తోంది.ఈ ఫోన్, రెడ్మీ నోట్ 3కి ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా హోరాహోరీగా తలపడుతోన్న ఈ రెండు ఫోన్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి చూసినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ అలానే డిస్‌ప్లే

ఇక వాట్సాప్ వీడియో స్ట్రీమింగ్

ఈ రెండు ఫోన్‌లకు డిజైన్ అలానే డిస్‌ప్లే అంశాలను పరిశీలించినట్లయితే, మెటల్ బాడీని ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా చూడొచ్చు. సమానమైన ఫుల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో వస్తోన్న ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి డిస్‌ప్లే సైజులను పరిశీలించినట్లయితే.. లెనోవో కే6 పవర్ 5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా, రెడ్మీ నోట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

ర్యామ్, ప్రాసెసర్, స్టోరేజ్

ఇంటర్నెట్‌లో నోకియా కొత్త ఫోన్ హల్‌చల్

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి.. వైబ్ కే6 పవర్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్‌తో వస్తుండగా, రెడ్మీ నోట్ 3 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 650 చిప్‌సెట్‌తో వస్తోంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 2జీబి అలానే 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 16జీబి అలానే 32జీబి వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను పొందవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పవర్ బ్యాటరీ

4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 3 ఫోన్ 4,050mAh బ్యాటరీ సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది. ఇదే సమయంలో వైబ్ కే6 పవర్ 4000mAh బ్యాటరీతో రాబోతోంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

డిసెంబర్ 2న వన్‌ప్లస్ 3టీ

రెడ్మీ నోట్ 3 ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో లెనోవో కే6 పవర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెడ్మీ నోట్ 3 ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో లాంచ్ అయ్యింది. ఇదే సమయంలో వైబ్ కే6 పవర్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో రాబోతోంది.

ధర విషయానికి వచ్చేసరికి

రెడీ నోట్ 3 విషయానికి వచ్చేసరికి 16జీబి వేరియంట్ ధర రూ.9,999 ఉంది. 32జీబి వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. లెనోవో వైబ్ కే6 పవర్ ఫోన్ ధర‌కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. రెడ్మీ నోట్ 3 తరహాలోనే ఈ ఫోన్ కూడా రూ.10,000 ధర రేంజ్ లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K6 Power to Launch on November 29: Can it compete with Xiaomi Redmi Note 3?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot