Home
Mobile

రెడ్మీ ఫోన్‌లకు షాకిచ్చేలా లెనోవో కే6 పవర్ లాంచ్ అయ్యింది

3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999.

By Sivanjaneyulu Bommu

తన పాపులర్ 'కే' సిరీస్ నుంచి లెనోవో కే6 పవర్ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో, మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999. డిసెంబర్ 6 నుంచి ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

Read More : మోటారోలా నుంచి మెటల్ బాడీ ఫోన్ వచ్చేస్తోంది..

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌

యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌

క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.

 గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్స్

గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్స్

ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

హైడెఫినిషన్ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసింగ్

హైడెఫినిషన్ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసింగ్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్..

3జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్,

3జీబి ర్యామ్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్,

ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్

రూ.10,000 మార్కెట్ పరిధిలో..

రూ.10,000 మార్కెట్ పరిధిలో..

రూ.10,000 అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో షియోమీ రెడ్మీ, లెనోవో వైబ్ కే సిరీస్ ఫోన్‌ల అమ్మకాల సునామీని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఐడీసీ నివేదిక ప్రకారం భారత్‌లో 10 శాతం మార్కెట్ వాటాను కలిగి లెనోవో రెండవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలవగా, 7.4శాతం మార్కెట్ వాటాతో షియోమీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Lenovo K6 Power Launched in India at Rs.9,999: 5 Reasons to Purchase the Smartphone Right Now. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X