ఓపెన్ సేల్ పై లెనోవో కే6 పవర్, రూ.9000 వరకు ఎక్స్‌ఛేంజ్!

లెనోవో నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లెనోవో కే6 పవర్ ఇప్పుడు ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మీ పాత ఫోన్‌తో ఈ కొత్త లెనోవో కే6 పవర్ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంది.

Read More : ఇండియాకు మరో చైనా కంపెనీ, రూ.3,999కే 4G-VoLTE ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదనంగా మరిన్ని ఆఫర్లు..

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే రూ.600 తగ్గింపు లభిస్తుంది, Axis బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే అదనంగా మరో 5 శాతం రాయితీ లభిస్తుంది.

రెండు ర్యామ్ వేరియంట్‌లలో..

లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.9,999. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999.

శక్తివంతమైన ఫీచర్లు..

క్వాల్క్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను యాక్షన్ ప్యాకుడ్ డివైస్‌గా తీర్చిదిద్దాయి.

మెటల్ యునిబాడీ డిజైన్‌తో..

ఆకట్టుకునే ఫినిషింగ్‌కు తోడు పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్..

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్..

ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్,  32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్

App lock ఫీచర్

App lock పేరుతో సరికొత్త ఫీచర్‌ను లెనోవో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ యాప్‌లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ప్రత్యేకమైన లాక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్

 డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్ సౌకర్యంతో వస్తోన్నఈ ఫోన్‌‌లో రెండేసి అకౌంట్లను నిర్వహించుకోవచ్చు. అంటే వాట్సాప్, హైక్ వంటి యాప్‌లను రెండేసి చప్పున రన్ చేసుకోవచ్చు.

పోటీ ఫోన్లు ఇవే..

రూ.10,000 అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో షియోమీ రెడ్మీ, లెనోవో వైబ్ కే సిరీస్ ఫోన్‌ల అమ్మకాల సునామీని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఐడీసీ నివేదిక ప్రకారం భారత్‌లో 10 శాతం మార్కెట్ వాటాను కలిగి లెనోవో రెండవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలవగా, 7.4శాతం మార్కెట్ వాటాతో షియోమీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K6 Power now available via open sale. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting