లెనోవో కే6 పవర్ vs షియోమీ రెడ్మీ 3ఎస్

పవర్ ప్యాకడ్ స్పెసిఫికేషన్‌లతో రెండు రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో కే6 పవర్, రూ.10,000 రేంజ్‌లో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు బ్రాండెడ్ కంపెనీ‌ల ఫోన్‌లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ
మధ్య మార్కెట్లో లాంచ్ అయిన షియోమీ రెడ్మీ 3ఎస్ ఫోన్‌కు లెనోవో కే6 పవర్ ప్రధాన పోటీగా అవతరించింది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్స్ మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే..

Read More : కూల్‌ప్యాడ్ నుంచి మూడు 4జీ సిమ్‌లను సపోర్ట్ చేసే ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే6 పవర్ ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోంది..

మీ అకౌంట్‌లోని డబ్బును ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?

షియోమీ రెడ్మీ 3ఎస్ అలానే లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 5 అంగుళాల స్ర్కీన్‌లతో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌లు మెటల్ బాడీలను కలిగి ఉన్నాయి. స్ర్కీన్ రిసల్యూషన్‌ల విషయంలో మాత్రం ఈ రెండు ఫోన్‌ల మధ్య స్పష్టమైన తేడాను మనం గమనించవచ్చు. కే6 పవర్ 1080 పిక్సల్ ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తుండగా, రెడ్మీ 3ఎస్ 720 పిక్సల్ స్ర్కీన్‌తో వస్తోంది.

హార్డ్‌వేర్ ఒక్కటే..

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి.. ఈ రెండు ఫోన్‌లు 1.4GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌లతో కూడిన సమానమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే..

ఆధార్ కార్డ్ ఉంటే చాలు, ఏటీఎమ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు

రెడ్మీ 3ఎస్ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ఇదే సమయంలో లెనోవో కే6 పవర్ 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని, ఈ రెండు ఫోన్‌లో కల్పించారు.

సమానమైన కెమెరా

ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ వంటి ప్రత్యేకతలతో కూడిన 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాలను ఈ రెండు ఫోన్‌లు కలిగి ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి లెనోవో కే6 పవర్ 8 మెగా పిక్సల్ సెన్సార్‌తో వస్తుండగా, రెడ్మీ 3ఎష్ కేవలం 5 మెగా
పిక్సల్ ఫ్రంట్ సెన్సార్‌ను మాత్రమే కలిగి ఉంది.

ఆపరేటింగ్ సిస్టం..

5 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌లకు సవాల్ విసురుతోన్న లెనోవో కే6 పవర్

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్థి చేసిన సొంత యూజర్ ఇంటర్‌ఫేస్‌లను ఈ ఫోన్‌లలో లెనోవో, షియోమీలు ఏర్పాటు చేయటం జరిగింది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి..

ఈ రెండు ఫోన్‌లకు బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లెనోవో కే6 పవర్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, రెడ్మీ 3ఎస్ ఫోన్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

స్పెసిఫికేషన్ప్ పరంగా చూస్తే..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెడ్మీ 3ఎస్ కంటే లెనోవో కే6 పవర్ మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.పవర్ హౌస్‌గా అభివర్ణించబడుతోన్న లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇతర ఫోన్‌లకు ఛార్జింగ్‌ను సమకూర్చుకోవచ్చు.

ధర విషయానికి వచ్చేసరికి..

లెనోవో కే6 పవర్ రూ.9,999 ధర ట్యాగ్‌తో డిసెంబర్ 5 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. Flipkartలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది. మరోవైపు రెడ్మీ 3ఎస్ ఫోర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.8,999.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K6 Power vs Xiaomi Redmi 3s: Battle Between Big Battery Budget Smartphones!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot