రెడ్మీ నోట్ 4కు షాక్, రూ.10,999కే లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్ (64జీబి స్టోరేజ్‌తో)

రెడ్మీ నోట్ 4కు షాకిస్తూ లెనోవో రూ.10,999కే 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. లెనోవో కే6 పవర్ పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రెడ్మీ నోట్ 4కు షాక్, రూ.10,999కే లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్

Read More : రెడ్మీ నోట్ 4 రికార్డ్ సేల్, 10 నిమిషాల్లో 2,50,000 ఫోన్‌లు

వాస్తవానికి డిసెంబర్, 2016లోనే లెనోవో 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ సౌకర్యంతో లెనోవో తన కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. తాజాగా.. 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో కూడిన అప్‌గ్రేడెడ్ వేరియంట్ లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ధర రూ.10,999. జనవరి 31, మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkartలో ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం షియోమీ ఇండియా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 4 (4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్) ఫ్లిప్‌కార్ట్ వద్ద రూ.12,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోన్న విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో

లెనోవో కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వేరియంట్ శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో వస్తోంది. స్టాండ్ బై మోడ్‌లో 649 గంటలు, టాక్ టైమ్ మోడ్‌లో 48 గంటల పాటు ఈ బ్యాటరీ స్పందించగలదని లెనోవో చెబుతోంది.

App lock ఫీచర్

App lock పేరుతో సరికొత్త ఫీచర్‌ను లెనోవో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ యాప్‌లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ప్రత్యేకమైన లాక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్

డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్ సౌకర్యంతో వస్తోన్నఈ ఫోన్‌‌లో రెండేసి అకౌంట్లను నిర్వహించుకోవచ్చు. అంటే వాట్సాప్, హైక్ వంటి యాప్‌లను రెండేసి చప్పున రన్ చేసుకోవచ్చు.

 

లెనోవో కే6 పవర్ (64జీబి) వర్షన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్, 441 పీపీఐ, 450 నైట్ బ్రైట్నెస్, 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

లెనోవో కే6 పవర్ (64జీబి) వర్షన్ స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం,

లెనోవో కే6 పవర్ (64జీబి) వర్షన్ స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ సోనీ IMX258 సెన్సార్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ప్రో మోడ్, పీడీఏఎఫ్ సపోర్ట్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, టైమ్ ల్యాప్స్), 8 మెగా పిక్సల్ Sony IMX219 సెన్సార్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లెనోవో కే6 పవర్ (64జీబి) వర్షన్ స్పెసిఫికేషన్స్

4,000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ విత్ VoLTE, వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, బ్లుటూత్, జీపీఎస్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K6 Power with 4GB RAM, 64GB storage launched. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot