ఫ్లిప్‌కార్ట్‌లో మరో హాట్‌ సేల్ జరుగుతోంది

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ ఆప్షన్‌తో లెనోవో తన కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మరో హాట్‌ సేల్ జరుగుతోంది

Read More : రెడ్మీ నోట్ 4 Vs లెనోవో కే6 పవర్ (బెస్ట్ 4జీబి ర్యామ్ ఫోన్ ఏది..?)

రెడ్మీ నోట్4 ప్రధాన పోటీగా మార్కెట్లో లాంచ్ అయిన ఈ డివైస్ మొదటి సేల్ Flipkartలో ప్రారంభమైంది. లిమిటెడ్ స్టాక్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ల పై ఫ్లిప్‌కార్ట్ 5% వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు మాత్రమే ఈ రూ.200 డిస్కౌంట్ వర్తిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో

లెనోవో కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వేరియంట్ శక్తివంతమైన 4,000mAh బ్యాటరీతో వస్తోంది. స్టాండ్ బై మోడ్‌లో 649 గంటలు, టాక్ టైమ్ మోడ్‌లో 48 గంటల పాటు ఈ బ్యాటరీ స్పందించగలదని లెనోవో చెబుతోంది.

App lock ఫీచర్

App lock పేరుతో సరికొత్త ఫీచర్‌ను లెనోవో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ యాప్‌లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ప్రత్యేకమైన లాక్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్

డ్యుయల్ ప్రొఫైల్ ఫీచర్ సౌకర్యంతో వస్తోన్నఈ ఫోన్‌‌లో రెండేసి అకౌంట్లను నిర్వహించుకోవచ్చు. అంటే వాట్సాప్, హైక్ వంటి యాప్‌లను రెండేసి చప్పున రన్ చేసుకోవచ్చు.

లెనోవో కే6 పవర్ (4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వర్షన్) స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్, 441 పీపీఐ, 450 నైట్ బ్రైట్నెస్, 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం,

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ సోనీ IMX258 సెన్సార్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ప్రో మోడ్, పీడీఏఎఫ్ సపోర్ట్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, టైమ్ ల్యాప్స్), 8 మెగా పిక్సల్ Sony IMX219 సెన్సార్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ విత్ VoLTE, వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, బ్లుటూత్, జీపీఎస్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K6 Power with 4GB RAM to go on sale today via Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot