ఓపెన్ సేల్ పై లెనోవో కే8 నోట్

లెనోవో కే సిరీస్ నుంచి నెల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన Lenovo K8 Note ఇప్పుడు ఓపెన్ సేల్ పై ట్రేడ్ అవుతోంది. Lenovo K8 Note ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఓపెన్ సేల్ డే ఆఫర్ క్రింద ఫోన్ కొనుగోల రూ.1000 వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూతో పాటు HSBC క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లకు రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ ఇస్తోంది.

Read More : 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ ఫోన్ రూ.21,499కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొత్తం రెండు వేరియంట్‌లలో...

లెనోవో కే8 నోట్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసిరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. ధర రూ.12,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ధర రూ.13,999.

డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్‌..

డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్ ప్యూర్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా స్టాక్ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. MediaTek Helio X20 SoC ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన బలం.

వాటర్ రిపల్లెంట్ నానో కోటింగ్‌..

వాటర్ రిపల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ చిన్నచిన్న నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వచ్చేసరికి Dolby Atmos, Music Key, TheaterMax వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. వీడియోలు చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఫీచర్స్ స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ను మీకు ఆఫర్ చేస్తాయి.

లెనోవో కే8 నోట్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K8 Note to go on open sale from September 15 on Amazon India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot