భారీ ఫీచర్లతో లెనోవో కే8 నోట్ వచ్చేసింది, ధర రూ.12,999
డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్ ప్యూర్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా స్టాక్ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. Helio X20 SoC ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన బలం.
లెనోవో కే8 నోట్ ఇండియాలో అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మొత్తం రెండు వేరింయట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసిరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. ధర రూ.12,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ధర రూ.13,999. ఆగష్టు 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా సేల్ ప్రారంభమవుతుంది.

డ్యుయల్ రేర్ కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్
డ్యుయల్ రేర్ కెమెరా సెన్సార్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్ ప్యూర్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా స్టాక్ ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది. MediaTek Helio X20 SoC ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన బలం.

వాటర్ రిపల్లెంట్ నానో కోటింగ్‌తో..
వాటర్ రిపల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ చిన్నచిన్న నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వచ్చేసరికి Dolby Atmos, Music Key, TheaterMax వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. వీడియోలు చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఫీచర్స్ స్పెషల్ ఎక్స్ పీరియన్స్ ను మీకు ఆఫర్ చేస్తాయి.

లెనోవో కే8 నోట్ స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

లాంచ్ డే ఆఫర్స్ ఇవే..
లాంచ్ డే ఆఫర్స్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై ఐడియా యూజర్లు రూ.343కే 64జీబి 4జీ డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ను పొందవచ్చు. ఇదే సమయంలో మోటో స్పోర్ట్స్ హెడ్‌ఫోన్స్ రూ.699కే లభిస్తాయి. రూ.300 ఖరీదు చేసే ఈ-బుక్స్ పై 80% వరకు రాయితీ పొందే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








