దూసుకొస్తున్న Lenovo K8 Note

లెనోవో లేటెస్ట్ స్మార్ట్‌‌ఫోన్ K8 Note విడుదలకు సిద్ధమవుతోంది. ఆగష్టు 9న ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయబోతున్నారు. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది. ఇందుకు సంబంధించిన మీడియా ఇన్విటేషన్స్ ఇప్పటికే అన్ని ప్రముఖ మీడియా సంస్థలకు అందాయి.

Read More : వాట్సాప్‌లో coloured Text status సదుపాయం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మల్టీకోర్ టెస్ట్‌లో 4,664 పాయింట్లు

ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ లెనోవో కే8 నోట్‌ పనితీరుకు సంబంధించి స్కోర్‌లను విడుదల చేసింది. మల్టీకోర్ టెస్ట్‌లో 4,664 పాయింట్లు, సింగిల్ కోర్ టెస్ట్‌లో 861 పాయింట్లను ఈ ఫోన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

డెకా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్

మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి పలు స్పెక్స్ కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అనధికారికంగా తెలుస్తోన్న సమచారం ఈ ఫోన్ 1.85GHz డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ బూట్ అవుతుంది.

వనిల్లా ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో...

అనధికారికంగా తెలుస్తోన్న సమచారం ఈ ఫోన్ 1.85GHz డెకా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ బూట్ అవుతుంది. వనిల్లా ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేసే మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కూడా లెనోవో కే8 కావటం విశేషం. మల్టీ విండో, లాంచ్ యాక్షన్స్, బెటర్ నోటిఫికేషన్ మేనేజ్ మెంట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.

లెనోవో కే6 నోట్‌కు సక్సెసర్ వర్షన్‌గా

గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో కే6 నోట్‌కు సక్సెసర్ వర్షన్‌గా లెనోవో కే8 నోట్ విడుదల కాబతోంది. లెనోవో కే6 నోట్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు పొడిగించుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లో నిక్షిప్తం చేసిన సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, డిజిటల్ కంపాస్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K8 Note’s specifications leaked ahead of official launch. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot