లెనోవో K8 Plus లాంచ్ అయ్యింది, ధర రూ.10,999, స్పెషల్ ఫీచర్స్ ఇవే

భారీ అంచనాల మధ్య లెనోవో తన లేటెస్ట్ బడ్జెట్ ఫ్రండ్లీ స్మార్ట్‌పోన్ Lenovo K8 Plusను మార్కెట్లో లాంచ్ చేసింది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ.10,999. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది.

Read More : గూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెప్టంబర్ 7 నుంచి సేల్..

సెప్టంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌‌కు సంబంధించి హాలివుడ్ వేరియంట్‌ను కూడా లెనోవో అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలో లాంచ్ కానున్న ఈ వేరియంట్ 4జీబి ర్యామ్‌తో ఫిట్ అయి ఉంటుంది.

Lenovo K8 Plus స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్టాక్ ఆండ్రాయిడ్ 7.1.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 64-బిట్ ట్రు ఆక్టా కోర్ 2.6Ghz 16nm చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

Lenovo K8 Plus స్పెసిఫికేషన్స్...

13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ మ్యూజిక్ కీ బటన్, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం, థియేటర్ మాక్స్ సినీమాటిక్ ఎక్స్‌పీరియన్స్, 4000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, యూఎస్బీ ఆన్ ద గో.

లాంచ్ ఆఫర్స్ ఇవే...

ఈ ఫోన్ కొనుగోలు పై పలు లాంచ్ ఆఫర్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ సిద్దంగా ఉంచింది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే.. 6 నెలల బయ్ బ్యాక్ గ్యారంటీ స్కీమ్, రూ.1599 ఖరీదు చేసే మోటో పల్స్ 2 హెడ్ ఫోన్స్ రూ.599కే సొంతం చేసుకునే అవకాశం, మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త ఫోన్‌ను ఎక్స్ ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, జియో యూజర్లకు ఉచితంగా 30జీబి 4జీ డేటా, ఫ్లిప్‌‍కార్ట్ స్మార్ట్‌బుయ్ 5 వాట్ బ్లుటూత్ స్పీకర్ పై రూ.100 డిస్కౌంట్, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ పై 15శాతం రాయితీ (సెప్టంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K8 Plus launched in India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting