రేపే లెనోవో K8 Plus విడుదల

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర సెగ్మెంట్‌లో లెనోవో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. K8 Plus పేరుతో సరికొత్త ఫోన్‌ను మార్కట్లో లాంచ్ చేసేందుకు లెనోవో ఏర్పాట్లు చేస్తోంది. సెప్టంబర్ 6వ తేదీన లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ ధర రూ.10,000లోపు ఉండొచ్చని వినికిడి.

Read More : Mi A1 లాంచ్ అయ్యింది, ధర రూ.14,999.. సెప్టంబర్ 12 నుంచి సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్..

ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభ్యమయ్యే ఈ ఫోన్‌కు డ్యుయల్ కెమెరా సపోర్ట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందట. Geekbench లిస్టింగ్స్ ప్రకారం ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో బూట్ అయ్యే కే8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ MT6757CD Helio P25 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. రెండు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అందులో మొదటి వేరియంట్ 3జీబి ర్యామ్ కాగా, రెండవ వేరియంట్ 4జీబి ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ గురించిన పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

కొద్ది రోజల క్రితమే లెనోవో కే8 నోట్

కొద్ది రోజల క్రితమే లెనోవో తన కే8 నోట్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్. ధర రూ.12,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. ధర రూ.13,999. ఆగష్టు 18 నుంచి సేల్ ప్రారంభమైంది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

లెనోవో కే8 నోట్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek Helio X20 10-core SoC, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo K8 Plus with dual cameras, stock Android teased ahead of September 6 launch. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot