లెనోవో ఎ536@రూ.8,999
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో, ‘ఎ536' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.8,999. ఆకర్షణీయమైన 5 మెగా పిక్సల్ కెమెరా, 1జీబి ర్యామ్, శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను లెనోవో (Lenovo) అధికారిక ఆన్‌లైన్ స్టోర్ thedostore ఇంకా దేశావ్యాప్తంగా ఉన్న 1400 లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో నేటి నుంచి విక్రయించనున్నారు. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.

లెనోవో ఎ536 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచుర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications