అల్లాటప్పా కాదండోయ్.. అదరగొట్టేస్తది!

Posted By: Super

అల్లాటప్పా కాదండోయ్.. అదరగొట్టేస్తది!

 

ప్రముఖ బ్రాండ్ లెనోవో ‘లీఫోన్ కె800’ పేరుతో ఉన్నత ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ ను గత జనవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల లైనప్ మరింత బలోపేతమువుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతంమైన ఆపరేటింగ్ సిస్టంతో పాటు యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్ల సౌలభ్యతతో రూపుదిద్దుకుంది. ఈ డివైజ్ వినియోగదారుకు ఖచ్చితమైన మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది.

ఫీచర్లు క్లుప్తంగా:

ఫోన్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతంది. భవిష్యత్‌లో ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేసే అవకాశముంది. 4.5 అంగుళాల స్ర్కీన్ 1280 x720పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉత్తమవైన విజువల్స్‌ను డిస్‌ప్లే చేస్తంది. ఇంటర్నల్ మెమెరీ 16జీబి. ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. పొందుపరిచిన 1.6గిగాహెడ్జ్ ప్రాసెసర్ ఉత్తమమైన ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది.

కెమెరా అంశాలను పరిశీలిస్తే హ్యండ్‌సెట్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కెమెరా క్లారిటీతో కూడిన వీడియో ఛాటింగ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో అమర్చిన శక్తివంతమైన బ్యాటరీ 336 గంటల స్టాండ్ బై అలాగే 8 గంటల టాక్‌టైమ్‌నందిస్తుంది. 3జీ కనెక్టువిటీ, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్ వంటి అంశాలు ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగవంతం చేస్తాయి. వై-ఫై 802.11 b, బ్లూటూత్ 3.0, యూఎస్బీ వంటి పీచర్లు స్మార్ట్‌ఫోన్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.27,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot