ఆ ఫోన్ ధర రూ.3,500 తగ్గింది

శక్తివంతమైన బ్యాటరీ కెపాసిటీతో లెనోవో నుంచి మార్కెట్లో లాంచ్ అయిన పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ లెనోవో పీ2 భారీ ధర తగ్గింపును అందుకుంది. 5100 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read More : డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి వేరియంట్ పై రూ.3,500, 4జీబి ర్యామ్ వేరియంట్ పై రూ.2,500

ఫ్లిప్‌కార్ట్‌లో ట్రేడ్ అవుతోన్న ఈ ఫోన్ పై రూ.3,500 వరకు తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుత ధరలను పరిశీలించినట్లయితే లెనోవో పీ2 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499 (పాత ధర రూ.16,999)గాను 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.15,499 (పాత ధర రూ.17,999)గాను ఉంది.

లెనోవో పీ2 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 410 పీపీఐ), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్ వేరియంట్స్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా,బ్యాటరీ, కనెక్టువిటీ..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 5100 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్.ఈ ఫోన్‌తో వచ్చే 24వాట్ రాపిడ్ ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల బ్యాటరీ లైఫ్ మీకు లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo P2 gets up to Rs.3,500 price cut. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot