శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో ‘లెనోవో పీ780’

|

తరచూ వ్యాపార అవసరాల రిత్యా దూరప్రాంతాలకు ప్రయాణించే మోడరన్ డే ట్రావెలింగ్ ఎక్జిక్యూటివ్‌లను దృష్టిలో ఉంచుకుని శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ‘పీ780' స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అత్యుత్తమ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్, ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ మొబైలింగ్ వంటి అంశాలు ఈ హ్యాండ్‌సెట్‌లో మెండుగా ఉన్నాయి.

 

లెనోవో పీ780, 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం (1280 x 720పిక్సల్స్), 175డిగ్రీల వీక్షణ యాంగిల్‌తో కూడిన 5 పాయింట్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. శక్తివంతమైన ఎంటీకే 6589 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. పొందుపరిచిన పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. 1జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. ఏర్పాటు చేసిన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థ 2జీ నెట్‌వర్క్ పై 43 గంటల టాక్‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 25 గంటల టాక్‌టైమ్‌ను ఇస్తుంది.

లెనోవో పీ780లో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.2.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్‌ను లోడ్ చేయటం జరిగింది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఫీచర్లను కలిగి అత్యుత్తత ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువచేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ సౌకర్యవంతమైన వీడియో కాలింగ్‌కు దోహదపడుతుంది. లెనోవో పీ780, 4జీబి ఇంటర్నల్ మెమరీ వ్యవస్థను కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.
లెనోవో పీ780 కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే:

డ్యూయల్ సిమ్, వై-పై 802.11 బీ/జీ/ఎన్ హాట్ స్పాట్ క్యాపబులిటీ, మైక్రోయూఎస్బీ వీ2.0, యూఎస్బీ - ఓటీజీ, బ్లూటూత్ 3.0, జీఎస్ఎమ్ 900/1800/1900మెగాహెట్జ్, ఎఫ్ఎమ్ రేడియో, సెన్సార్ ఫీచర్లు: ఏ-జీపీఎస్, గ్రావిటేషన్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్.

తరచూ ప్రయాణించి వ్యాపారవేత్తలకు లెనోవో పీ780 ఉత్తమ ఎంపిక. ఈ హ్యాండ్‌సెట్‌లోని 5 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

లెనోవో పీ780 స్మార్ట్ ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో ‘లెనోవో పీ780’

శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో ‘లెనోవో పీ780’

బ్యాటరీ లైఫ్:

లెనోవో పీ780లో శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. 2జీ నెట్‌వర్క్ పై 43 గంటల టాక్‍‌టైమ్, 3జీ నెట్‌వర్క్ పై 25 గంటల టాక్‌టైమ్‌ను పొందవచ్చు.

 

మెటల్ బాడీ

మెటల్ బాడీ

మెటల్ బాడీ:

లెనోవో పీ780లో పటిష్టవంతమైన మెటల్ బాడీతో డిజైన్ చేయటం జరిగింది. హ్యాండ్‌సెట్ అనుకోకుండా క్రిందపడినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

 

డ్యూయల్ సిమ్ సామర్థ్యం
 

డ్యూయల్ సిమ్ సామర్థ్యం

డ్యూయల్ సిమ్ సామర్థ్యం:

లెనోవో పీ780 డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన రెండు సిమ్ స్లాట్‌లు జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. తరచూ ప్రయాణించి వ్యాపారవేత్తలకు ఈ డివైజ్ మరింత ఉపయుక్తకరం.

 

హైడెఫినిషన్ స్ర్కీన్

హైడెఫినిషన్ స్ర్కీన్

హైడెఫినిషన్ స్ర్కీన్:

లెనోవో పీ780 అత్యుత్తమ హైడెఫినిషన్ స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫోన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్. వీడియోలను హైడెఫినిషన్ క్లారిటీతో విక్షించవచ్చు.

 

మీ డబ్బుకు ఖచ్చితమైన విలువ

మీ డబ్బుకు ఖచ్చితమైన విలువ

మీ డబ్బుకు ఖచ్చితమైన విలువ:

ఇండియన్ మార్కెట్లో లెనోలో పీ780, 4జీబి వర్షన్ ధర అంచనా రూ.17,000. ఈ దీపావళిని పురస్కరించుకని లెనోవో ‘పీ780' 8జీబి వర్షన్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మార్కెట్ ధఱ రూ.18,000. తర్వపడండి మరి!

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X