ఇదుగోండి లెనోవో ఫాబ్ 2 ప్లస్, ధర రూ.14,999

6.4 అంగుళాల డిస్‌ప్లే వేరింయట్‌లో లెనోవో తన Phab 2 Plus స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.14,999. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు 2.5డీ కర్వుడ్ డిస్‌ప్లేతో కూడిన 6.4 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

Read More : ఎయిర్‌టెల్ సంచలన ఆఫర్, నెలకు 5జీబి డేటా ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ డిస్‌ప్లే ఇంకా ప్రాసెసర్

6.4 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ (MT8783) ప్రాసెసర్, మాలీ టీ720 జీపీయూ,

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఫోన్ కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆటో లేజర్ కెమెరా సెటప్ అండ్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు (హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ VoLTE, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, బ్లుటూత్, జీపీఎస్). డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం,

శక్తివంతమైన బ్యాటరీ

శక్తివంతమైన 4050 mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఫోన్ బరువు 218 గ్రాములు, చుట్టుకొలత 17.4 x 0.55 x 8.8సెంటీ మీటర్లు. Champagne Gold ఇంకా Gunmetal Grey colourలో ఫోన్ లభ్యమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Phab 2 Plus launched in India at Rs 14,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot