సంచలనం రేపుతోన్న గూగుల్, లెనోవో ప్రాజెక్ట్ టాంగో ఫోన్

|

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ అత్యాధునిక 3డీ మోషన్ సెన్సింగ్ ఆధారంగా, గూగుల్ 'ప్రాజెక్ట్ ట్యాంగో' ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ పై రన్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ 'ఫాబ్ 2 ప్రో' (Phab 2 Pro)ను కొద్ది నెలల క్రితం లెనోవో ప్రపంచానికి పరిచయం చేసింది.

 సంచలనం రేపుతోన్న గూగుల్, లెనోవో ప్రాజెక్ట్ టాంగో ఫోన్

Read More : ప్రమాదంలో గూగుల్ ప్లే స్టోర్, చిక్కుల్లో 400 యాప్స్

శాన్‌ఫ్రాన్సిస్కొలో నిర్వహించిన టెక్ వరల్డ్ 2016 కాన్ఫిరెన్స్‌లో భాగంగా లెనోవో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. వాస్తవానికి ఈ ఫోన్ మే నెలలో లాంచ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు అది జరగలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ ఫోన్ ను నవంబర్ లో లాంచ్ చేసేందుకు గూగుల్ లెనోవోలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో ప్రత్యేకతలు..

గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో ప్రత్యేకతలు..

గూగుల్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్.. అడ్వాన్సుడ్ కంప్యూటర్ విజన్, లోతైన సెన్సింగ్ ఇంకా మోషన్ ట్రాకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకుని ఆన్ స్ర్కీన్ 3జీ అనుభూతులను సృష్టించగలదు. తద్వారా యూజర్ తన చుట్టూ ఉన్న వాటిని క్షుణ్ణంగా పరీశీలించగలదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో ప్రత్యేకతలు..

గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో ప్రత్యేకతలు..

ప్రత్యేకంగా రూపొందించిబడిన హార్డ్‌వేర్ పై పని చేయగలిగే ఈ ట్యాంగో సాఫ్ట్‌వేర్, యూజర్ ప్రతి కదలికను పసిగట్టి అందుకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. ట్యాంగో ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు ప్రదేశాలను సులువుగా గుర్తించగలవు.

ప్రత్యేకమైన సెన్సార్..

ప్రత్యేకమైన సెన్సార్..

ట్యాంగో ఫోన్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సెన్సార్, గదుల చుట్టుకొలతలను రియల్ టైమ్‌లో క్యాప్చూర్ చేసి 3డీ కొలతలను ఇవ్వగలదు. ఈ చుట్టుకొలతలను సేవ్ చేసుకుని ఫర్నిచర్ లేదా డెకరేషన్ సామాగ్రిని కొనుగోలు చేసేటపుడు ఉపయోగించుకోవచ్చు. లెనోవో ఫాబ్2 ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లెనోవో ఫాబ్ 2 ప్రో డిస్‌ప్లే..

లెనోవో ఫాబ్ 2 ప్రో డిస్‌ప్లే..

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560 × 1440పిక్సల్స్,

ఆక్టా‌కోర్ ప్రాసెసర్..

ఆక్టా‌కోర్ ప్రాసెసర్..

క్వాల్కమ్ అందిస్తోన్న ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. అడ్రినో 501 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నల్ స్టోరేజ్..

ఇంటర్నల్ స్టోరేజ్..

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ లో 4జీబి ర్యామ్ ను నిక్షిప్తం చేసారు. 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకున అవకాశం కల్పించారు.

కెమెరా స్పెక్స్..

కెమెరా స్పెక్స్..

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫోన్ కెమెరా స్పెక్స్ పరిశీలించినట్లయితే ఫోన్ వెనుక భాగంలో శక్తివంతమైన 16 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. డెప్త్ సెన్సార్, మోషన్ ట్రాకింగ్ ఫర్ ట్యాంగో వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరాలలో ఉన్నాయి. హ్యాండ్‌సెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.2 అపెర్చర్‌తో వస్తోంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శక్తివంతమైన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

శక్తివంతమైన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4050 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్నఈ బ్యాటరీని వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

అట్మోస్ సౌండ్ సిస్టం...

అట్మోస్ సౌండ్ సిస్టం...

ఫోన్‌‍లో ఏర్పాటు చేసిన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం 5.1 ఆడియో క్యాప్చుర్, ట్రిపుల్ Array మైక్రోఫోన్స్ విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కనెక్టువిటీ ఫీచర్లు...

కనెక్టువిటీ ఫీచర్లు...

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి 100కు పైగా ప్రత్యేకమైన యాప్స్‌ను ఈ ఫోన్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు లెనోవో తెలిపింది.

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

ఇన్‌‌ఫ్రారెడ్ ఎమిటర్ అలానే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఆధారంగా ప్రాజెక్ట్ ట్యాంగో కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఈ రెండు వ్యవస్థలు రేంజ్ ఫైండర్‌లా వ్యవహరించి డివైస్‌కు ఆబ్జెక్ట్‌కు మధ్య దూరాన్ని కొలుస్తాయి. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ కెమెరా లోకేషన్‌కు సంబంధించిన వివరాలను యాడ్ చేస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కలర్ వేరియంట్స్ ఇంకా ధర

కలర్ వేరియంట్స్ ఇంకా ధర

లెనోవో ఫాబ్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్, షాంపైన్ గోల్డ్ ఇంకా గన్ మెటల్ గ్రే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. సెప్టంబర్ నుంచి ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతుంది. ధర 499 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.33,300.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Lenovo PHAB 2 Pro Set to Launch in November. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X