లెనోవో ఫోన్‌లకు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో ఇండియన్ మార్కెట్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తోంది. ఇప్పటికే తన వైబ్ సిరీస్ నుంచి పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను లెనోవో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. మరో ముందడుగులో భాగంగా గురువారం లెనోవో తన ఎస్ సరీస్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌ను అందుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎస్930, ఎస్650, ఎస్820, ఎస్920, ఎస్660, పీ790 మోడల్స్ ఉన్నాయి.

లెనోవో ఫోన్‌లకు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌డేట్

లెనోవో ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న 6 అంగుళాల పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘లెనోవో వైబ్ జెడ్2 ప్రో' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా, లెనోవో మరో ఆవిష్కరణతో మందుకొచ్చింది. తన లేటెస్ట్ వర్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ఏ7-30ని లెనోవో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ధర రూ.9,979. ఔత్సాహికులు లెనోవో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు..

లెనోవో ఏ7-30 వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే  (రిసల్యూషన్ 1024 x 600), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ8382ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ (వయా డాంగిల్), వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్, సిమ్ కార్డ్ స్లాట్), 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు, డాల్బీ డిజిటల్ ప్లస్ ఫీచర్ వ్యవస్థతో కూడిన శక్తివంతమైన స్టీరియో స్పీకర్లను ఈ ట్యాబ్లెట్‌లో ఏర్పాటు చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo To Roll-Out KitKat Update for Six Smartphones in India Starting This Week. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot