లెనోవో ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్, చెక్ చేసుకోండి

రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో, అన్ని 4జీ స్మార్ట్‌ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్ తప్సనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో లెనోవో తన కే సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్ నుంచి కే4 నోట్, కే5 ప్లస్, వైబ్ కే5
స్మార్ట్‌ఫోన్‌లకు VoLTE అప్‌డేట్‌ను లాంచ్ చేసింది.

Read More : ఆ నోకియా ఫోన్లు మళ్లీ వస్తున్నాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓవర్ ద ఎయిర్ రూపంలో

ఓవర్ ద ఎయిర్ రూపంలో రిలీజ్ చేసిన ఈ అప్‌డేట్‌ను లెనోవో యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి About Phone -> Software Update ద్వారా పొందవల్సి ఉంటుంది.

మార్చి 31, 2017 వరకు జియో ఉచితం..

తన వైబ్ కే5 నోట్ యూజర్ల కోసం, లెనోవో ఇప్పటికే 4G VoLTE అప్‌డేట్‌ను అందుబాటులో ఉంచింది. అప్‌డేట్‌ను స్వీకరించటం ద్వారా లెనోవో యూజర్లు జియో సిమ్ సపోర్ట్‌ను పొందటంతో పాటు మార్చి 31, 2017 వరకు ఆ నెట్‌వర్క్ ఆఫర్ చేస్తున్న అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో కే4 నోట్ స్పెసిఫికేషన్స్...

డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 3జీబి ర్యామ్, 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6753 ఆక్టా - కోర్ ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 405 జీపీయూ, 2750 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ..

4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ఆక్టా కోర్ సీపీయూ, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వార ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2750 ఎమ్ఏ హెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

4G VoLTE అప్‌డేట్‌ను పొందనున్న లెనోవో వైబ్ కే5 నోట్ స్పెసిఫికేషన్స్...

డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, థియేటర్‌మాక్స్ టెక్నాలజీ, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5.5 అంగుళాల డిస్‌ప్లే, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo rolls out Jio sim update for its K series smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot