సాలిడ్ స్పెసిఫికేషన్‌లతో లెనోవో ఎస్60
ఎస్60 పేరుతో తన ఎస్ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ఫోన్‌ను లెనోవో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 5 అంగుళాల పెద్దదైన డిస్‌ప్లే, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి సాలిడ్ స్పెసిఫికేషన్‌లతో లభ్యమవుతోన్న ఈ ఫోన్ ధర రూ.12,999. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక స్టోర్ అయిన http://www.thedostore.com తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతోంది. గ్రాఫైట్ గ్రే కలర్ వేరియంట్‌లో ఈ డివైస్ అందుబాటులో ఉంది.
(చదవండి: మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో బోలెడన్ని ఉపయోగాలు!)

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా ( ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతలతో), 5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
(చదవండి: మీ కోసం ఫన్నీ గాడ్జెట్స్)

డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్ (భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ లాలీపాప్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, జీపీఆర్ఎస్ లేదా ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (3జీ నెట్‌వర్క్స్ పై 17 గంటల టాక్‌టైమ్, 240 గంటల స్టాండ్‌బై టైమ్).


Click it and Unblock the Notifications








