లెనోవో ఎస్850@రూ.15,499
దేశీయ మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోన్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లెనోవో ‘ఎస్850'(S850) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.15,499. ఇటీవలే చైనాకు చెందిన మరో మొబైల్ ఫోన్‌ల కంపెనీ జియోమీ మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. లెనోవో ఎస్850 ప్రధాన స్పెసిపఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స),
178 డిగ్రిల వెడల్ప వీక్షణా కోణం,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
పవర్ వీఆర్ SGX544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్,
3జీ, వై-ఫై, బ్లూటూత్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








