లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో 'Vibe K5' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. ఈ ఫోన్ ధర రూ.6,999. Amazon India ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. రెడ్మీ నోట్ 3, లీ 1ఎస్ ఇకో ఫోన్‌లకు పోటీగా బరిలోకి దిగిన ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం...
Read More : రాత్రికి రాత్రే పొలాల్లో గొయ్యలు, వింత ఆకారాలు
లెనోవ్ వైబ్ కే5 ఫోన్ డిజైన్ విషయానికొస్తే ప్లాస్టిక్ ఇంకా మెటల్ కాంభినేషన్‌లో ఫోన్ నిర్మాణం ఉంటుంది. ప్లాటినమ్ సిల్వర్, చాంపేన్ గోల్డ్, గ్రాపైట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వైబ్ కే5 ఫోన్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 180 డిగ్రీ వైడ్ యూగింగ్ వ్యూవింగ్ సామర్థ్యాలను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది. వైబ్ కే5 ఫోన్‌లో 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. వైబ్ కే5 ఫోన్ 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. వైబ్ కే5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. లెనోవో వైబ్ కే5 ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం. లెనోవో వైబ్ కే5 ఫోన్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తంది. ఫోన్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఏమ్ రేడియో, ఎఫ్ఎమ్ రేడియో). లెనోవో వైబ్ కే5 ఫోన్ శక్తివంతమైన 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు. లెనోవో వైబ్ కే5 ఫోన్ మొదటి ఫ్లాష్‌సేల్ జూన్ 22న Amazon.inలో ఎక్స్‌క్లూజివ్‌గా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. లీఇకో లీ1ఎస్, షియోమీ రెడ్మీ నోట్ 3, మోటరోలా మోటో జీ3 ఫోన్‌లకు ఈ లెనోవో వైబ్ కే5 ఫోన్ కాంపిటీటర్‌గా నిలవనుంది.
లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే

లెనోవో కొత్త ఫోన్ ‘Vibe K5’ రూ.6,999కే


Click it and Unblock the Notifications