Home
Mobile

4జీబి ర్యామ్‌తో లెనోవో ఫోన్, రూ.11,999కే!

By Sivanjaneyulu Bommu

భారీ అంచనాల మధ్య లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యింది. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.13,499. బ్లాక్, సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్‌లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Flipkart ఆగష్టు 3 నుంచి ఓపెన్ సేల్ పై విక్రయించనుంది. ఫోన్ ప్రత్యేకతలను ఓ సారి చూద్దాం...

Read More : విండోస్ 10 ఇక ఉచితం కాదు!

లెనోవో వైబ్ కే5 నోట్ - డిస్‌ప్లే

లెనోవో వైబ్ కే5 నోట్ - డిస్‌ప్లే

లెనోవో వైబ్ కే5 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు.

లెనోవో వైబ్ కే5 నోట్ - హార్డ్‌వేర్

లెనోవో వైబ్ కే5 నోట్ - హార్డ్‌వేర్

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్
స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

లెనోవో వైబ్ కే5 నోట్ - సాఫ్ట్‌వేర్

లెనోవో వైబ్ కే5 నోట్ - సాఫ్ట్‌వేర్

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు.

 లెనోవో వైబ్ కే5 నోట్ - కెమెరా

లెనోవో వైబ్ కే5 నోట్ - కెమెరా

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

లెనోవో వైబ్ కే5 నోట్ - కనెక్టువిటీ ఇంకా బ్యాటరీ ఫీచర్లు

లెనోవో వైబ్ కే5 నోట్ - కనెక్టువిటీ ఇంకా బ్యాటరీ ఫీచర్లు

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.

లెనోవో వైబ్ కే5 నోట్ - ఇతర ఫీచర్లు

లెనోవో వైబ్ కే5 నోట్ - ఇతర ఫీచర్లు

లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‍‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.

లాంచ్ ఆఫర్స్

లాంచ్ ఆఫర్స్

వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‌తో పాటు అందిస్తోన్న లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా రూ.999కే థియేటర్ మాక్స్ కంట్రోలర్‌తో పాటు ANTVR హెడ్‌సెట్‌ను లెనోవో ఆఫర్ చేస్తుంది. Amkette Evo Gamepad Pro 2తో పాటు ANTVR హెడ్‌సెట్‌ను కేవలం రూ.1,999కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Best Mobiles in India

English summary
Lenovo Vibe K5 Note Launched in India. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X